కోస్తా ఆంధ్ర మరియు తెలంగాణ లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఉత్తరకొస్తాతో పాటు పలు కోస్తా జిల్లాలు మరియు తెలంగాణలో పలు జిల్లాలలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల గురించి వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. రానున్న రెండు రోజులపాటు ఏపీలో మరియు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం విశాఖపట్నం శ్రీకాకుళం మధ్య వద్ద తీరం దాటనున్నట్లు సమాచారం.
వర్షాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏపీలో వర్షాలకు సంబంధించి అధికారులు అలర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ మరియు జిల్లాల వారీగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఇప్పటికే పలు జిల్లాలలో ఆదేశాలు జరిచేయడం జరిగింది అవసరమైతే తప్ప బయటకి రావద్దు అని కూడా అధికారంలో వెల్లడించారు.
ఒక తెలంగాణలో కూడా ఉధృతంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రానున్న రెండు రోజులపాటు తెలంగాణలో కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు.
సోమ మంగళవారం వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.