75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం: మార్గదర్శకాలువిడుదల

75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం: మార్గదర్శకాలువిడుదల

రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 15,000 అందించే మహాశక్తి తల్లికి వందనం పథకానికి హాజరు నిబంధనను
విధించింది.

బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం కింద రూ.15 వేల ఆర్థికసాయం అందిస్తామని టిడిపి కూటమి సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయంతెలిసిందే.

దారిద్ర్య రేఖ దిగువ(బిపిఎల్) ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జిఓ 29ను విడుదల చేశారు. 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఈ పథకం కింద రూ.15వేలు అందిస్తామని పేర్కొన్నారు.

ఇది పొందాలంటే విద్యార్థి హాజరు 75 శాతం ఉండాలనే షరతు విధించారు.అదే విధంగా ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని,అందువల్ల ఆధార్ ను ఎన్రోల్ చేసుకోవాలని పేర్కొన్నారు.

బ్యాంకు, లేదా పోస్ట్ ఆఫీసు పాస్ బుక్, పాన్, పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు,ఎంజిఎస్ఆర్ఆజిఎ కార్డు, కిసాన్ ఫోటో పాసుబక్, డ్రైవింగ్ లైసెన్స్,గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహశీల్దార్ ఇచ్చిన గుర్తింపు పత్రం, ఇతర శాఖలు ఇచ్చిన పత్రాలతో ఎన్రోల్ చేసుకోవాలని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే స్టూడెంట్ కిట్ కు కూడా ఆధార్ తప్పనిసరి అని పేర్కొన్నారు.

Click here to Share

You cannot copy content of this page