అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలకే పేద ప్రజల ఆకలి తీరుస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా మరో 70 అన్నా క్యాంటీన్లను తెరవనున్నట్లు ప్రకటించింది.
ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్న క్యాంటీన్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే 113 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉండగా, పలు నియోజకవర్గాల్లో ఒకటి కంటే ఎక్కువ అన్న క్యాంటీన్లు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రెండు వందల పైచిలుకు అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. కొత్తగా ప్రారంభించబోయే 70 అన్నా క్యాంటీన్లతో కలిపి మొత్తం 273 అన్న క్యాంటీన్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల ఆకలి తీర్చనున్నాయి.
అన్న క్యాంటీన్ లకు సంబంధించినటువంటి మెనూ, టైమింగ్స్ మరియు ఇతర వివరాల కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Leave a Reply