రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు పథకాలకు ఆముదం తెలిపిన విషయం మనకు తెలిసిందే, వీటిలో మూడు పథకాలను ముఖ్యమంత్రి జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ 7 వ తేదీన ప్రారంభించారు. చేనేత కుటుంబాల సంక్షేమానికి మరియు వారిని పైకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మంగళగిరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన మూడు పథకాలు
మంగళగిరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ తో కలిసి చేనేత కార్మికుల కోసం ఆగస్టు 7న 3 పథకాలను ప్రారంభించారు.
- చేనేత కార్మికులకు జీఎస్టీ మినహాయింపు
- చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు. చేనేత మగ్గాలపై 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అదే విధంగా పవర్ మగ్గాలపై ఈ 5 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పథకానికి కూడా నేటి నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- ఇక చేనేత కార్మికుల పొదుపు కోసం త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో 8 శాతం చేనేత కార్మికుల నుంచి ఎనిమిది శాతం ప్రభుత్వం జోడించి వారికోసం ఒక పొదుపు ఫండ్ ను ప్రారంభించింది. ఈ పథకం కింద ఏటా ఐదు కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
- చేనేత పరిశ్రమను మరింత ప్రోత్సహించడానికి అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ మూడు పథకాలను ముఖ్యమంత్రి జాతీయ చేనేత దినోత్సవం రోజున ప్రారంభించడం జరిగింది. అయితే ప్రభుత్వం మరొక పథకాన్ని కూడా పేర్కొనడం జరిగింది. నేతన్న భరోసా కింద 25 వేల రూపాయలు ఇచ్చే పథకానికి సంబంధించి త్వరలో విధివిధానాలు మరియు ప్రారంభ తేదీని ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 93 వేల చేనేత కుటుంబాలకు అండగా ఉంటామని వారిని పైకి తీసుకొచ్చేలా కృషి చేస్తామని ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
నేతన్న భరోసా కింద 25000..
- నేతన్న భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం త్వరలో కార్యచరణ మరియు గైడ్లైన్స్ వెల్లడించనుంది.
- నేతన్న భరోసా అనే కొత్త పథకం ద్వారా చేనేత కార్మికులకు ప్రతి ఏటా 25 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం.

గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు ప్రతి ఏటా నేతన్న నేస్తం కింద అప్పటి ప్రభుత్వం 24,000 ఏటా జమ చేస్తూ వచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం ఒక వెయ్యి అదనంగా వారికి జోడించి 25000 త్వరలో అందించనుంది.
నేతన్నల సంక్షేమం కోసం 648 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. అంతేకాకుండా వారి కోసం త్రిఫ్ట్ ఫండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేతన్నల సంక్షేమం మరియు వారిలో పొదుపును పెంపొందించే ఉద్దేశంతో ఈ తృప్తి పండుగ ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు.

Leave a Reply