తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) SCT SI (సివిల్) మరియు తత్సమాన పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ప్రిలిమినరీ రాత పరీక్ష (PWT)లో అర్హత సాధించడానికి కొన్ని కేటగిరీల అభ్యర్థులు పొందవలసిన కనీస అర్హత మార్కులను(minimum qualifying marks) తగ్గించింది. SCT PCలు (సివిల్) మరియు / లేదా తత్సమాన పోస్టులు, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్స్ మరియు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఇది వర్తిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు ఉత్తర్వులలో జారీ చేసిన కొత్త సవరణల ప్రకారం, PWT పేపర్‌లో అర్హత సాధించడానికి, OC లకు కనీస మార్కులు 30 శాతం, బీసీలకు 25 శాతం మరియు ఎస్సీ, ఎస్టీలు మరియు మాజీ సైనికులకు(Ex Serviceman) 20 శాతం, TSLPRB ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు, రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ల ప్రకారం, అన్ని కేటగిరీలకు అంటే, OCలు, BCలు, SCలు, STలు మరియు మాజీ సైనికులకు కనీస అర్హత మార్కులు 30 శాతం గా ఉండేది.
Download latest GO below
Leave a Reply