స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) లో 45284 కానిస్టేబుల్ జిడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2022

ssc recruitment

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) తాజాగా భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 45,284 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)లో సిపాయి పోస్టులు భర్తీకి ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహిస్తోంది.

     పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

ఖాళీల వివరాలు

కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్(జనరల్ డ్యూటీ)/ సిపాయి: 45,284 పోస్టులు

Force NameMaleFemaleTotal
BSF17650311520765
CISF53235915914
CRPF1058958011169
SSB19242432167
ITBP15192681787
AR315303153
SSF11638154
NCB175

అర్హతలు: 

గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.

వయోపరిమితి: 

జనవరి 01, 2023 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02-01-2000 కంటే ముందు, 01-01-2005 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: 

సిపాయి పోస్టుకు రూ.18,000-రూ.56,900 వరకు, ఇతర ఖాళీలకు రూ.21,700-రూ.69,100 మధ్య చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: 

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.

సీబీఈ పరీక్ష విధానం:

 ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌/ హిందీ అంశాలనుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది.

దరఖాస్తు రుసుము: 

రూ.100(మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. 

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: 

చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు

వివరణతేదీ
నోటిఫికేషన్ తేదీ27.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ27.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ30.11.2022
ఆఫ్‌లైన్ చలానా రూపొందించేందుకు చివరి తేదీ30.11.2022 (23:00)
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ01.12.2022 (23:00)
చలాన్ ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ01.12.2022
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీJanuary, 2023

అధికారిక నోటిఫికేషన్‌ & దరఖాస్తు లింక్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page