ISRO ద్వారా అత్యంత బరువైన LVM3-M2 రాకెట్ ప్రయోగం విజయవంతం. మొత్తం 36 ఉపగ్రహాలను నింగిలో ప్రవేశ పెట్టిన LVM M2
మొత్తం 43.5 మీటర్ల పొడవైన ఈ రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి అక్టోబర్ 23 అర్ధరాత్రి 12.07 గంటలకు నింగికి ఎగిసింది.
ఈ రాకెట్ ప్రత్యేకతలు :
- 8,000 కిలోల వరకు ఉపగ్రహాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ LVM 3 రాకెట్ ఇస్రో చరిత్ర లోనే అత్యంత బరువైన రాకెట్.
- ఇక ఈ ప్రయోగం LVM3 ద్వారా తొలి వాణిజ్య ప్రయోగం కావడం మరో ముఖ్య విషయం. OneWeb కి చెందిన ప్రవైట్ ఉపగ్రహాలను రెండు దశలలో కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు ఇస్రో ఒప్పందం చేసుకుంది. ఇది మొదటి మిషన్ కాగా రెండవది 2023 లో చేపట్టనున్నారు. అంతేకాకుండా,
- LVM3-M2 ద్వారా Lower Earth Orbit అనగా దిగువ భూమి కక్ష్యలో ప్రవేశపెట్టడం ఇది మొదటి సారి .
ఇస్రో చరిత్ర లోనే 6-టన్నుల పేలోడ్‌ను అంతరిక్ష మార్కెట్‌కు తీసుకెళ్లడం ఇదే తొలిసారి. 36-ఉపగ్రహ పేలోడ్ బరువు 5.8 టన్నులు కాగా ఇప్పటివరకు ఇదే ఇస్రో చరిత్రలో భారీ పేలోడ్.
ఇక ఈ దిగ్గజ రాకెట్ అక్టోబర్ 23 న విజయవంతంగా వన్‌వెబ్ బ్రాడ్‌బ్యాండ్ కాన్స్టెలేషన్ సంస్థ కు చెందిన 36 అంతర్జాల కమ్యూనికేషన్ ఉపగ్రహాలను వాటి కోసం ఉద్దేశించిన కక్ష్యలలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇదే ప్రయోగం లో భాగంగా రెండో విడత గా వచ్చే ఏడాది LVM-M3 రాకెట్ ద్వారా మరో 36 OneWeb ఉపగ్రహాలను నింగి లోకి ప్రవేశ పెట్టనున్నట్లు ISRO చైర్‌పర్సన్, S. సోమనాథ్ ప్రకటించారు.
Leave a Reply