ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. నాలుగేళ్ల తర్వాత నియామక నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి మొత్తం 4 దశలో ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.
- పోలీసు ఉద్యోగాల ఎంపికకు 4 దశలు
- తొలుత ప్రాథమిక రాత పరీక్ష
- అర్హత మార్కులు సాధిస్తే PMT, PET కి ఎంపిక
- ఆ తర్వాత తుది రాత పరీక్ష
దశ-1: ప్రాథమిక రాత పరీక్ష
సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు..
• సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి తొలుత ప్రాథ మిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) నిర్వహిస్తారు.
•ప్రశ్నపత్రం: 200 మార్కులకు 200 బహుళై చిక (ఆబ్జెక్టివ్) ప్రశ్నలుంటాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది..
సివిల్, ఏపీఎస్పీ ఆర్ఎస్సై ఉద్యోగాలకు..
• సివిల్, ఏపీఎస్పీ ఆర్ఎస్సై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి తొలుత ప్రాధ మిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) నిర్వహిస్తారు.
• ఒక్కోటి 100 మార్కుల చొప్పున మొత్తం 2 పేపర్లు 200 మార్కులకు ఉంటాయి. బహుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్) ప్రశ్నలుం . తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రం వుంటుంది.
అర్హత మార్కులు:
మహిళలు- 40 శాతం, బీసీలు, ఈడబ్ల్యూఎస్ లు-35 శాతం, ఎస్సీ, ఎస్టీలు, మాజీ సైనికోద్యోగులు-30 శాతం మార్కులు సాధించాలి. పోటీ ఎక్కువైతే కటాఫ్ మార్కులు పెడతారు.
కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులను తదుపరి దశలో శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), దేహ దారుఢ్య పరీక్షలకు (పీఈటీ) ఎంపిక చేస్తారు.
దశ-2శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ):
- ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీపడేవారు శారీరక కొలతల పరీక్షలో (పీఎంటీ) అర్హత కోసం పురుషులు 167.6 సెంటిమీటర్లు, మహిళలు 152.5 సెంటిమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండకూడదు.
- పురుషులు ఛాతీ చుట్టుకొలత 86. 39 సెంటిమీటర్ల కంటే తక్కువ ఉండ కూడదు. శ్వాస పీల్చినప్పుడు చాతీ 5 సెంటిమీటర్ల మేర విస్త రించాలి.
- మహిళలు బరువు 40 కిలోల కంటే తక్కువ ఉండకూడదు.
దశ-3: దేహ దారుఢ్య పరీక్షలు (పీఈటీ):
సివిల్ ఎస్సై, సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడేవారు
- దేహ దారుఢ్య పరీక్షల్లో పురుషు లైతే 8 నిమిషాల్లో, మహిళలైతే 10 నిమిషాల 30 సెకన్లలో 1,600 మీటర్ల పరుగు పూర్తి చేయాలి..
- 100 మీటర్ల పరుగు, లాంగ్లింప్ విభాగాల్లో ఏదో ఒక దాంట్లో అర్హత సాధిస్తే చాలు. నిర్దేశిత సమయంలో అవి పూర్తి చేయాలి..
- సివిల్ ఎస్సై, సివిల్ కానిస్టేబుల్ అభ్యర్ధులకు ఇది కేవలం అర్హత పరీక్షే. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
ఏపీఎస్పీ ఆర్ఎస్సై, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడేవారు
- 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్లింప్ అర్హత సాధించాలి. మహిళలు ఈ పోస్టుకు పోటీపడే అవకాశం లేదు.
- ఏపీఎస్పీ ఆర్ఎస్సై, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీపడే వారికి 1600 మీటర్ల పరుగుకు 40, 100 మీటర్ల పరుగుకు 30, లాంగంపు 30 చొప్పున 100 మార్కులకు దేహ దారుఢ్య పరీక్ష నిర్వహిస్తారు.
ఏ పరీక్షను ఎంత సమయంలో పూర్తి చేయాలంటే
Test | Mans | Ex army | Womans |
1600 మీటర్ల పరుగు | 8 నిమిషాలు | 9 నిమిషాల 30 సెకన్లు | 10 నిమిషాల 30 సెకన్లు |
100 మీటర్ల పరుగు | 15 సెకన్లు | 16.5 సెకన్లు | 18 సెకన్లు |
లాంగ్ జంప్ | 3.80 మీటర్లు | 3.65 మీటర్లు | 2.75 మీటర్లు |
దశ-4: తుది రాత పరీక్ష
సివిల్ ఎస్సై ఉద్యోగాలకు పోటీపడే వారికి..
- మొత్తం 600 మార్కులకు 4 పేపర్లుంటాయి.
- పేపర్ –1: ఆంగ్లం,
- పేపర్ –2: తెలుగు… వందేసి మార్కులకు నిర్వహిస్తారు. రెండు పేపర్లు వివరణాత్మక విధానంలో (డిస్క్రిప్టివ్) ఉంటాయి. వీటిలో అర్హత మార్కులు సాధిస్తే చాలు.
- పేపర్ –3: అర్థమేటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ,
- పేపర్-4: జనరల్ స్టడీస్ రెండేసి వందల మార్కులకు నిర్వహి స్తారు. ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో (ఆబ్జెక్టివ్) ఉంటాయి. ఈ రెండు పేపర్లలో కలిపి 400 మార్కులకుగానూ అభ్యర్థులు సాధించిన. మార్కులనే ఉద్యోగ ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకుంటారు.
ఆంగ్లం, తెలుగు పేపర్లలో అర్హత సాధించకపోతే మిగతా.. రెండు పేపర్లను పరిగణనలోకి తీసుకోరు.
ఏపీఎస్పీ ఆర్ఎస్సై ఉద్యోగాలకు పోటీపడే వారికి..
- పేపర్-1, పేపర్-2లు సివిల్ ఎస్సై అభ్యర్థులకు ఉన్నట్లే వందేసి మార్కులకు ఉంటాయి. వీటిలో అర్హత మార్కులు సాధిస్తే చాలు. పేపర్-3, పేపర్-4లను వందేసి చొప్పున 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ రెండు పేప ర్లలో అభ్యర్థి సాధించిన మార్కులను, 100 మార్కులకు నిర్వహించిన దేహ దారుడ్య పరీక్షల్లో అభ్యర్ధి సాధించిన మార్కులకు కలుపు తారు. మొత్తం 300 మార్కులకుగానూ అత్య ధిక మార్కులు సాధించిన వారిని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
- సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడే వారికి 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. అత్యధిక మార్కులు సాధించినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు.
- ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడే వారికి 200 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర మార్కు ఉంటుంది. 100 మార్కులకు నిర్వహించిన దేహ దారుఢ్య పరీక్షల్లో ఆయా అభ్యర్థులు సాధించిన మార్కులను వీటికి కలుపుతారు. మొత్తం 200కు అత్యధిక మార్కులు వచ్చిన వారు ఉద్యోగానికి ఎంపికవుతారు.
తుది రాత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించినవారే విజేత
తాజా నోటిఫికేషన్లో భర్తీ చేయనున్న పోస్టులివే
సివిల్ ఎస్సై పోస్టులు
జోన్-13) (విశాఖపట్నం రేంజ్): శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం – 50
జోన్-29 (ఏలూరు రేంజ్): తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా- 105
జోన్ – 3 (గుంటూరు రేంజ్): గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 55
జోన్- 43 (కర్నూలు రేంజ్): చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు-105.
ఏపీఎస్పీ ఆర్ఎస్సై పోస్టులు ఐఆర్ బెటాలియన్ల వారీగా…
ఎచ్చెర్ల, రాజమహేంద్రవరం, మద్ది పాడు, చిత్తూరులలో ఏర్పాటు చేసే ఐఆర్ బెటాలియన్లలో ఒక్కోచోట 24 చొప్పున మొత్తం 96 పోస్టులు.
సివిల్ కానిస్టేబుల్ పోస్టులు పోలీసు యూనిట్ల వారీగా…
Name of the Unit | posts |
Srikakulam | 100 |
Vizianagaram | 134 |
Visakhapatnam City | 187 |
Visakhapatnam Rural | 159 |
East Godavari | 298 |
Rajamahendravaram Urban | 83 |
West Godavari | 204 |
Krishna | 150 |
Vijayawada City | 250 |
Guntur Rural | 300 |
Guntur Urban | 80 |
Prakasam | 205 |
Nellore | 160 |
Kurnool | 285 |
YSR. District Kadapa | 325 |
Ananthapuramu | 310 |
Chittoor | 240 |
Tirupathi urban | 110 |
ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు
- ఎచ్చెర్ల, రాజమహేంద్రవరం, మద్దిపాడు. చిత్తూరులలో ఏర్పాటు చేసే ఐఆర్ బెటాలియన్లలో ఒక్కోచోట కానిస్టేబుల్ పోస్టులు. 630 చొప్పున మొత్తం 2,520 ఏపీఎస్పీ
Download Official Notification PDF & Apply online Link for AP Police SI and Constable Recruitment 2022
Detailed Official Notification & Application Form for APSLPRB Recruitment 2022 are provided below
Leave a Reply