22-1-2023 నాడు కానిస్టేబుల్ వ్రాత పరీక్ష వ్రాసే అభ్యర్థులకు ఈ క్రింది సూచనలు చేయబడ్డాయి
- ఏపీ లో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష ఉ.10 గంటల నుంచి మ. 1 వరకు జరుగుతుంది.
- 10 గం. తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా చూడాలి.
- అభ్యర్థులు మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వాలెట్,నోట్స్ వంటివి తీసుకురాకూడదు.
- అభ్యర్థులు తమ హాల్ టికెట్, పెన్ ఆధార్ కార్డు/రేషన్ కార్డు లాంటి గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకురావాలని
సూచించారు.పరీక్ష రాసేందుకు బ్లూ/బ్లాక్ పాయింట్ ని మాత్రమే వాడాలి
ఏపీ కానిస్టేబుల్ పరీక్ష కు సంబంధించి ముఖ్యమైన సూచనలు
- ఇవ్వబడిన నిర్దిష్ట సమయంలో అన్ని ప్రశ్నలకు (200 ప్రశ్నలు) సమాధానం చేయుటకు అభ్యర్థి సమయపాలన
పాటించాలి. - అన్ని ప్రశ్నలకు సమానమైన మార్కులను రిక్రూట్మెంట్ బోర్డు వారు కేటాయించారు.
- పరీక్షాపత్రంలో 200 మార్కులు, 200 ప్రశ్నలు ఉంటాయి, సమయం 180 నిముషాలు.
ప్రతి ప్రశ్నకు సమాధానం చేయుటకు దాదాపుగా 49 సెకన్ల టైం ఉంటుంది. - విద్యార్థి ప్రశ్నకు సమాధానం చేయుటకు ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
1) ప్రశ్న చదవాలి
2) ప్రశ్న చదివి అర్ధం చేసుకుని, సమాధానం గుర్తించాలి.
3) OMR షీట్ పైన Bubble చేయాలి.
పైన తెలిపిన మూడు అంశాలు 49 సెకన్లలో ప్రతి ప్రశ్నకు చేయగల్గితే విద్యార్థి అన్ని ప్రశ్నలకు సమాధానం చేయగలడు. - ఇవ్వబడిన ప్రశ్నాపత్రంలోని ప్రశ్నల్లో కొన్ని కఠినమైన ప్రశ్నలు, కొన్ని సులభమైన ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థి
మొదట ప్రశ్న సంఖ్య 1 నుండి 200 వరకు సులభమైన ప్రశ్నలకు మొదట సమాధానం గుర్తించాలి..
1) ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను సమాధానం చేయుటకు విద్యార్థి తన 1.Q. మేరకు ఈ క్రింది విధంగా రౌండ్స్ను
ఎంచుకొనవలెను.
2) మొదటి రౌండులో గంటన్నర సమయంలో 1 నుండి 200 వరకు సులభమైన ప్రశ్నలకు సమాధానం చేయవలెను.
(దాదాపుగా 100 నుండి 150 ప్రశ్నలకు సమాధానం చేయవలెను)
3) రెండవ రౌండులో గంట సమయంలో 60 ప్రశ్నలకు సమాధానం చేయవలెను.
4) మూడవ రౌండులో అతికష్టమైన ప్రశ్నలకు సమాధానం చేయవలెను.
5) విద్యార్థి అభీష్టం మేరకు పైన తెలుపబడినవి పాటించినచో విద్యార్థి 200 ప్రశ్నలకు సులభంగా ఇవ్వబడిన నిర్దిష్ట
సమయంలో సమాధానం గుర్తించగలడు. నెగిటివ్ మార్క్స్ లేవు కావున విద్యార్థి అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయవలెను. - పరీక్షకు ఒక రోజు ముందు రాత్రి బాగా విశ్రాంతి తీసుకోవలెను.
పరీక్ష రోజున గంట ముందుగా పరీక్ష కేంద్రమునకు చేరుకొని పరీక్ష హాలులో OMR షీట్లోని అన్ని కాలమ్స్న
జాగ్రత్తగా భర్తీ చేయవలెను.
Leave a Reply