విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తన విలక్షణమైన నటనతో ప్రస్తుతం దేశమంతా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇటీవల “జవాన్” చిత్రంతో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టారు. ఆయన ప్రస్తుతం విలన్ పాత్రలతో కూడా మెప్పిస్తున్నారు… ప్రస్తుతం ఆయన ప్రతి నాయకుడిగా నటించిన జవాన్ చిత్రం ఇప్పుడు 1000 కోట్ల క్లబ్లో చేరటానికి కొంచెం దూరంలో మాత్రమే ఉంది. ఇక మన తెలుగులోనూ ఉప్పెన, సైరా చిత్రాలు చేశారు. ఇక తమిళంలో హీరోగా దూసుకెళ్తున్నారు…

తాజాగా ఆయన మరో తమిళంలో మరో సినిమా చేయనున్నారు.. తమిళంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ఒక సినిమా రూపొందుతున్నది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోవాలని దర్శకుడు భావించినట్లు తెలుస్తుంది.. అదే విషయాన్ని విజయ్ సేతుపతికి తెలియజేయగా కృతి శెట్టితో నటించ నటించేందుకు ఆయన ఒప్పుకోలేదట…

ఆర్టిస్టులకు పాత్రుల విషయంలో పరిమితులు ఏమి ఉండవు. ఒక సినిమాలో ఓ హీరోకు హీరోయిన్గా నటించిన నటి ఇంకో సినిమాలో చెల్లిగా నటిస్తుంటారు. ‘సైరా’ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించిన నయనతార ‘గాడ్ ఫాదర్’ లో చెల్లెలి పాత్రలో మెప్పించింది. ఇదంతా సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణమే. ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటినుండి ఇప్పటివరకు కూడా ఇలా ఎంతోమంది కథానాయకులు అన్నా చెల్లెలుగా తండ్రి కూతురిగా నటించిన వారే హీరో హీరోయిన్ గా కూడా నటించి మెప్పించిన విషయం తెలిసింది.


అయితే విజయ్ సేతుపతి మాత్రం తన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ అనగానే నో అనేసాడు. అసలు కారణమేంటంటే తన కూతురిగా చేసిన అమ్మాయితో రొమాన్స్ చేయలేనని తేల్చి చెప్పాడు. ఉప్పెన చిత్రంలో కృతి శెట్టి విజయ్ సేతుపతి కూతురుగా నటించింది.. ఉప్పెన క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో కృతి శెట్టి, మా ఇద్దరి మధ్య ఓసారి క్లైమాక్స్ సీన్ తీస్తున్నప్పుడు ఆమె కొంచెం కంగారు పడుతుంటే “నాకు నీ వయసున్న కొడుకు ఉన్నాడు పర్వాలేదు స్వేచ్ఛగా నటించు అని ప్రోత్సహించాను”. ఇప్పుడు ఆమెకు జోడిగా నటించడం నా వల్ల కాదు అని మేకర్స్ కి స్పష్టం చేశారు. దీంతో ఆమెను ఈ సినిమా నుండి తప్పించినట్లు తెలుస్తుంది..

ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో కృతి శెట్టి బంపర్ ఆఫర్ వచ్చిందని టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో కృతి పాత్ర కొంచెం గ్లామరస్ గా ఉంటుందట. అందులో భాగంగా ఓ సన్నివేశంలో కథకు తగ్గట్టు కృతి బికినీలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో బికినీ ధరించేందుకు నిర్మాతలు కృతికి రూ 4 కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. మరి ఈ వార్తల్లో ఎంతో నిజముందో తెలియాల్సి ఉంది.


ఇక విజయ్ సేతుపతి సినిమా నుండి కృతి శెట్టిని తప్పించడం, కృతికి మాత్రం ఒక పెద్ద సినిమా వదులుకున్నట్లు అయింది. ఎందుకంటే విజయ్ సేతుపతి హీరోయిన్గా వద్దనడంతో ఆమెకి ఆ సినిమా ఛాన్స్ మిస్ అయినట్లే. ఆమె ఇంకెప్పటికీ విజయసేతుపతి పక్కన ఒక ప్రియురాలుగా నటించలేకపోవచ్చు అని అంటున్నారు…..
Leave a Reply