యంగ్ స్టార్ హీరో “విజయ్ దేవరకొండ”, “జెర్సీ” సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో తన తదుపరి చిత్రానికి సంతకం చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ‘గ్యాంగ్ స్టార్’ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందనుందని విజయ్ ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలను వెల్లడించాడు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడని ఇదివరకే వార్తలు వచ్చాయి. శ్రీ లీల ఈ చిత్రంలో కథానాయిక గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు మొదట “రామ్ చరణ్” తో హీరోగా ప్లాన్ చేసిన గౌతమ్ ఆ తర్వాత “విజయ్ దేవరకొండ” దగ్గరికి వెళ్ళాడు.

గౌతమ్ తిన్ననూరి మరియు విజయ్ దేవరకొండ ఇటీవల ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. అంతేకాక ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. “జెర్సీ”,”మళ్ళీరావా” వంటి ఎమోషనల్ డ్రామా లకు దర్శకత్వం వహించిన గౌతమ్: “వీడీ12” తో ఏదో ఒక ప్రత్యేకతను తెరపైకి తీసుకొస్తాడని పోస్టర్లను చూస్తే కచ్చితంగా తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ తన కెరీర్ లో తొలిసారిగా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో, పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడన్న అధికారిక ప్రకటనతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మరియు లాంచ్ సందర్భంగా “బీడీ12” యూనిట్ చాలా ఆసక్తికరమైన పోస్టర్లను విడుదల చేసింది.

ఇదిలా ఉంటే విజయ్ తన రాబోయే చిత్రం ఖుషీతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు ఇది సెప్టెంబర్ 1న విడుదల కానుంది ఈ చిత్రంలో సమంత రూత్ ప్రభు కథానాయక నటిస్తుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన పాటలు చిత్రానికి మంచి క్రేజ్ని తెచ్చిపెట్టాయి…
Leave a Reply