అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరు చెప్పలేరు అలాంటి అదృష్టం ఇప్పుడు హీరో తరుణ్ వరించింది అనే చెప్పవచ్చు… టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పాపులారిటీ సంపాదించుకున్న తరుణ్ స్టార్టింగ్ లో సూపర్ హిట్ సినిమాలు నటించి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరుణ్ నటించిన చిత్రాల్లో మరీ ముఖ్యంగా నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి, నువ్వే నువ్వే, శశిరేఖా పరిణయం, వంటి సినిమాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కే గాక బ్యాచ్‌లర్ బాయ్స్, లవర్ బాయ్స్ కూడా చాలా దగ్గరయ్యాడు.

ఇప్పటికి కూడా ఈ సినిమాలను బుల్లితెరపై చూసి ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తుంటారు. తరుణ్ బాల నటుడు గాను చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు.. అంజలి, ఆదిత్య 369, తల్లితండ్రులు వంటి ఎన్నో హిట్ చిత్రాలలో బాలనట్టుగా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.


కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే తరుణ్ ఎన్నో ఎలిగేషన్స్ను ఎదుర్కొన్నాడు. వాటిలో మరీ ముఖ్యంగా ఆర్తి అగర్వాల్‌తో ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమయ్యాడు కొంతకాలం గ్యాప్ తర్వాత తీసిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.. దాంతో తరుణ్ ఇండస్ట్రీకు శాశ్వతంగా దూరమయ్యి ఆఫర్లు రాక సినిమాలు చేయడం మానుకున్నాడు.

అయితే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుతున్న సెలబ్రిటీస్ లిస్ట్ ఎక్కువైపోతుంది. , ఇటీవల కాలంలో జగపతిబాబు , శ్రీకాంత్ తమ సెకండ్ ఇన్నింగ్స్ ను విలన్ గా స్టార్ట్ చేసి ఎన్నో సపోర్టింగ్ రోల్స్ ను చేస్తూ తమ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడిపిస్తున్నాడరు!!!… రీసెంట్ గా హీరో వేణు కూడా వెబ్ సిరీస్ లో నటించి సెకండ్ ఇన్నింగ్స్ నా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే… అయితే ఈ క్రమంలో తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయాడు తరుణ్!!…

త్వరలోనే ఓ పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది… అంతేకాదు ఈ సినిమాలో హీరోకి బ్రదర్ పాత్రలో కనిపించబోతున్నాడట తరుణ్… కథాపరంగా పాజిటివ్ కంటెంట్ ఉన్న ఈ సినిమాలో ఆయన నెగటివ్ స్టేట్స్ గల పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది!!!… దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది ఇక ఈ సినిమా తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే.
Leave a Reply