సొట్ట బుగ్గల హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో పరిచయమైన తాప్సి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ మధ్య గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసిన అమ్మడు మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్గా కొనసాగింది. అంతే కాకుండా అత్యధిక స్థాయిలో పారితోషకం కూడా తీసుకుంటూ బిజీబిజీగా కనిపించింది. కానీ గత రెండేళ్ల కాలం నుంచి ఆమెకు సరైన సక్సెస్ లు అయితే రావడం లేదు. అయినప్పటికీ కూడా విభిన్నమైన ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిజీ అవుతూ ఉంది. ఇక సౌత్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తే తప్ప ఆమె ఇటువైపు తిరిగి చూడడం లేదు.

సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కొర్రకారులను తన వైపు తిప్పుకునే తాప్సి రీసెంట్గా ఒక చిట్ చాట్ లో పాల్గొని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అనే ప్రశ్నకు ఎవరు ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది. నా పెళ్లి ఎప్పుడు అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. అయితే నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. గర్భవతిని కాదు కాబట్టి నా పెళ్లి ఇప్పట్లో ఉండకపోవచ్చు. ఒకవేళ అలా ఏదైనా జరిగే అవకాశం ఉంటే తప్పకుండా చెప్తాను అంటూ తాప్సి ఊహించని విధంగా రిప్లై ఇచ్చింది.


ఈ విధంగా రిప్లై ఇవ్వడంతో సోషల్ మీడియాలో తాప్సి ఒకరికి కౌంటర్ ఇచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే. ఇక త్వరలో డెలివరీ అవుతున్న సందర్భంలో ఆమె తన బిడ్డకు పుట్టబోయే భర్తను సోషల్ మీడియాలో రివిల్ చేసింది. అయితే ఇప్పుడు తాప్సి పెళ్లి ప్రస్తావన రాగానే పెళ్లి చేసుకోవడానికి నేను ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు అనే డైలాగ్ వాడడంతో ఈమె ఇలియానాకు కౌంటర్ ఇచ్చిందా? లేదంటే మరో విధంగా మాట్లాడిందా? అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

ఇక తాప్సి అయితే గత తొమ్మిది ఏళ్లుగా ఒక బ్యాట్మెంటన్ ప్లేయర్ తో ప్రేమలో ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఆమె ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం అయితే బాలీవుడ్ లోనే చాలా బిజీగా మారిపోయింది. అలాగే ఆ మధ్య ఒక తమిళ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తుంది.
Leave a Reply