సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా…. కూతురు సితార మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. చిన్నవయసులో యాడ్ షూట్లో పాల్గొన్న స్టార్ కిడ్ గా ఘనత సాధించింది. ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కడికో వెళ్లిపోయినట్లు కనిపిస్తుంది. చేసింది జువెలరీ యాడ్ అయితేనేం….. సితారకు పెద్ద మొత్తమే ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్.. ఏడాది లేదా ఏడాదిన్నరకు ఓ సినిమా చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటాడు. కానీ యాడ్స్, రూపంలో మరోవైపు నుంచి గట్టిగానే సంపాదిస్తున్నాడు … పాన్ మసాలా దగ్గరనుంచి సోప్ వరకు ప్రతిదానిలోనూ యాక్ట్ చేస్తున్నాడు . కోట్ల కోట్లు ఆర్జిస్తుంటాడు మహేష్ ఫ్యామిలీ అంతా కలిసి గతంలో ఓ యాడ్ లో కనిపించారు.. ఆ తర్వాత కూతురు సితారకు పోలో ఆఫర్స్ వచ్చాయని టాలీవుడ్ టాక్.. కానీ ఎందుకో మహేష్ బాబు వాటిని ఒప్పుకోలేదు.. ఇప్పుడు మాత్రం జువెలరీ యాడ్ లో సితార
నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..


కొన్ని రోజుల ముందు ఈ యాడ్ షూట్ జరగ్గా…ఆ వీడియోని న్యూయార్క్ లోని టైం స్క్వేర్ లో తాజాగా ప్రదర్శించారు…. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహేష్ బాబు…. కూతురు ఎదుగుదల చూసి తెగ ఆనంద పడిపోయాడు. చాలా ఆఫర్లకు ఒప్పుకోని మహేష్ బాబు…. ఈ యాడ్ కి ఎలా అంగీకరించాడో 100 డాలర్స్ ప్రశ్నగా ఉండి ఉండొచ్చు. అయితే దీనికి సమాధానం? గా ఈ యాడ్లో నటించినందుకు గాను సితారకు రూ. కోటి ఇచ్చారట.. బహుశా మహేష్ కూడా తన తొలి యాడ్ కోసం ఇంత భారీ మొత్తంలో తీసుకొని ఉండి ఉండడు. అందుకే సితార యాడ్ షూట్ కి ఒప్పుకున్నాడేమో?.
Leave a Reply