సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మాయోసైటిస్ వ్యాధి తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే షూటింగు కు గ్యాప్ తీసుకొని మరి ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. అయితే ఆ సమయంలోనే వ్యాధి నయమైందని అందరూ అనుకున్నారు కానీ, రీసెంట్గా మరో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది సమంత..


మాయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం మరో వారం రోజుల్లో అమెరికా వెళుతున్నానని ఈసారి ఎలాగైనా నయం అయ్యేదాకా వదలనని చెప్పుకొచ్చారు. ఈ ట్రీట్మెంట్ కు ముందు సమంత మనోధైర్యం కోసం దైవ దర్శనాలకు వెళ్తున్నారు..

ఇందులో భాగంగా ఆమె తాజాగా తమిళనాడులోని రాయవేలూరు గోల్డెన్ టెంపుల్ ను దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు శ్యామ్. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూసిన అభిమానులు….. సమంత త్వరలోనే పూర్తిగా కోలుకొని తిరిగి రావాలని కోరుకుంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.


ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో “ఖుషి” సినిమా చేస్తున్నారు శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత సమంత బాలీవుడ్లో సిటాడెల్ వెబ్ సిరీస్ ను చేస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న ఈ సిరీస్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Leave a Reply