బాలీవుడ్ లో నడుస్తున్న టాలీవుడ్ హీరోల హవా! సల్మాన్ ఖాన్ తో జతకట్టిన మెగా పవర్.

బాలీవుడ్ బాడీగార్డ్, బజరంగీ భాయిజాన్ అయినా సల్మాన్ ఖాన్ కి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ,రామ్ చరణ్ కుటుంబాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్న సంగతి ఫ్యాన్స్ అందరికీ తెలిసిందే. అందుకే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “గాడ్ ఫాదర్” చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించి ఫ్యాన్స్ కు విందు చేశాడు. అలాగే తన సినిమాలో కూడా రామ్ చరణ్ ని నటింపజేసేందుకు సల్మాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ అయినా సల్లు భాయ్ ప్రస్తుతం “కిసీ కా భాయ్ కిసీ కీ జాన్” సినిమా చేస్తున్నాడు . అందులో టాలీవుడ్ హీరో వెంకటేష్ ఉన్నాడు .మరియు ఈ చిత్రంలోనే రామ్ చరణ్ అతిధి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ తరుణంలోనే ఈ పాటకు సంబంధించిన టీజర్ ని మూవీ టీం రిలీజ్ చేసింది. “యెంటమ్మా “అని సాగే ఈ పాటని చిత్ర బృందం విడుదల చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్ లో సల్మాన్ ఖాన్, వెంకీ మామ పసుపు రంగు చోక్కాల్లో తెల్ల పంచల్లో కనిపించారు .పండుగ వాతావరణంలా ఉన్న ఒక స్టేజ్ పై వారిద్దరూ నవ్వుతూ డాన్స్ చేస్తూ ఉండగా ఓ వ్యక్తి ఆ స్టేజ్ పైకి వెళ్తుంటాడు ఆ వ్యక్తి ఎవరో అని చూడగా ……ఇంకెవరు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది‌.

అయితే ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ సల్మాన్ ఖాన్ కామా వెంకీ మామతో రామ్ చరణ్ లుంగీ డాన్స్ చేశాడు.

బాలీవుడ్ స్టార్ హీరో అయినా సల్లు బాయ్ సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్ పాత్రల్లో తెరక్కెక్కుతున్న సినిమా “కిసి కా భాయ్…. కిసీ కి జాన్”. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా నుంచి బతుకమ్మ సాంగ్ రిలీజ్ అవ్వగా. ఈరోజు “యెంటమ్మ” రిలీజ్ అయింది. ఈ సాంగ్లో సల్మాన్ ఖాన్ వెంకటేష్ తో స్పెషల్ అప్పి యరెన్స్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చి లుంగీ డాన్స్ చేశారు. ఈ సినిమా ఈ నెల 21 న రిలీజ్ కాబోతోంది.

అయితే “కిసి కా భాయ్ కిసి కా జాన్” చిత్రంలో బతుకమ్మ ఆడిన పాట ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఓ బాలీవుడ్ మూవీలో తెలంగాణకి సంబంధించిన బతుకమ్మ సాంగ్ ఉండడంతో టాలీవుడ్ ప్రేక్షకులు సంబరపడిపోతున్నారు. ‌ ఇక ఆ పాటకి యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో ఇప్పుడు విడుదలైన “ఏంటమ్మా”సాంగ్ ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page