ఇప్పుడు ‘బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్’ అన్న రేంజ్ లో గొడవ స్టార్ట్ చేశారు.’సలార్ ‘టీజర్ ని మా ‘జవాన్’ ట్రైలర్ తొక్కేసింది అంటూ ”షారుక్ ఖాన్ ”అభిమానులు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు..

ఇప్పటివరకు తెలుగు హీరోల కోసం గొడవలు పడిన అభిమానులు, ఇప్పుడు ‘బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్’ అన్న రేంజ్ లో గొడవ స్టార్ట్ చేశారు. అసలే టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై దండెత్తి కోట్లు కొల్ల కొట్టడం చూసిన ”B టౌన్” ప్రముఖులకు గొంతులో ముద్ద మింగుడు పడనట్లుగా ఉంది….. ఇప్పుడు ‘సలార్ ‘టీజర్ ని మా ‘జవాన్’ ట్రైలర్ తొక్కేసింది అంటూ ”షారుక్ ఖాన్ ”అభిమానులు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.. బాహుబలితో హిందీలో బలంగా జెండా పాతిన ప్రభాస్ ని నార్త్ ఆడియన్స్ ఎంతగా ఇష్టపడ్డారో సాహో చిత్రం నిరూపించింది.


అయితే ”సలార్” టీజర్ రిలీజ్ అయినా 24 గంటల్లోనే యూట్యూబ్లో ’85 మిలియన్’ వ్యూస్ సాధించింది .ఇది కదా రికార్డ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మురిసిపోయారు. అయితే నిన్న ‘జవాన్’ప్రివ్యూ అంటూ విడుదల అయింది. షారుక్ -అట్లీ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ‘జవాన్’ ప్రివ్యూ ని రిలీజ్ చేయగా అది “112 మిలియన్” వ్యూస్ ని రాబట్టింది. అంటూ నిర్మాత ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులు ఉడికి పోతున్నారు.


‘సలార్’ టీజర్ లొ ప్రభాస్ జస్ట్ కొద్ది సెకండ్స్ మాత్రమే కనిపించాడు .దానికి “24 గంటల్లో” ’85 మిలియన్’ వ్యూస్ వచ్చాయి. కానీ జవాన్ ప్రివ్యూ లో షారుఖ్, నయన్, దీపిక ,విజయ్ సేతుపతి, లాంటి స్టార్స్ ఉన్నారు. మొత్తం యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ అది….. అయినా మీ జవాన్ వ్యూస్ ఎక్కడ యూట్యూబ్లో కనిపించనే లేదు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ జవాన్ వ్యూస్ పై మండిపడుతున్నారు.…..


సోషల్ మీడియాలో మొత్తం మా హీరో ప్రభాస్ గొప్ప అంటే, కాదు! మా హీరో షారుక్ గొప్పంటు అభిమానుల మధ్యన మాటల యుద్ధం , కామెంట్ల వర్షం మొదలయ్యింది….
ఇదంతా చూసిన నెటిజెన్స్ ఇదెక్కడి గోల రా నిన్నటి వరకు తెలుగు హీరోల అభిమానులు తన్నుకు చస్తే, ఇప్పుడు హిందీ వాళ్ళు కూడా బయలుదేరారు అంటూ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు ….
Leave a Reply