మూడు రోజులు ముందే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది “సలార్ ” టీజర్… ప్రశాంత్ నీల్ చివరి సినిమా ‘కే జి ఎఫ్ -2’ టీజర్ చూసి ఊగిపోయిన ప్రేక్షకులు…. అదే దృష్టితో ఈ టీజర్ మీద అంచనాలు పెట్టుకున్నారు…. కానీ? ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో అయితే టీజర్ లేదన్నది వాస్తవం. అయినా కానీ ఈ టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అనేక రికార్డులు నెలకొల్పింది.
డార్లింగ్ ప్రభాస్ నుంచి కొన్ని రోజుల ముందు “ఆది పురుష్” వచ్చింది. అభిమానుల్ని ఆ సినిమ ఘోరంగా నిరాశపరిచింది. దీంతో వాళ్ల దృష్టoతా ‘సలార్’ మీదకు మళ్ళింది. అందుకు తగ్గట్లే జులై 6న ఉదయం 5 :12 గంటలకు టీజర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ ని డైనోసార్ తో పోల్చుతూ… కొత్త తాత ఇచ్చిన ఎలివేషన్స్ “గూస్బంప్స్” తెప్పించాయి. రెండు రోజుల వ్యవధిలోనే “సలార్” టీజర్, వ్యూస్ ఏకంగా 100 మిలియన్ మార్కును దాటేశాయి. లైక్స్ కూడా రికార్డు స్థాయిలో ఉన్నాయి. కానీ ప్రభాస్ ని 10 సెకండ్ల లోపే, అది కూడా ముఖం సరిగా చూపించకపోవడం ఫాన్స్ ని ఒక్కంత నిరాశపరిచిందనే చెప్పవచ్చు.
అయితే ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహం పరిచెంసలార్ టీం ట్రైలర్ కబురు ను చెప్పేసింది. హలో ఫ్యాన్స్ అందరూ ఆగస్టు నెలను మార్క్ చేసుకొని పెట్టుకోవాలని, ఆ నెలలోనే ట్రైలర్ లాంచ్ చేయబోతున్నామని, “సలార్” నిర్మాణ సంస్థ అయిన ”హోంబలే ” ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించింది. సలార్ కు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత తాము మరింత కష్టపడి పనిచేసి “సలార్” ను ఇంకా మెరుగ్గా తీర్చి దిద్ది ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా మరియు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తీసుపోకుండా ఉండేలా ఉంటుందని “హోంబలే ఫిలిమ్స్” పేర్కొంది.
అయితే “సలార్ “రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28 అన్న సంగతి తెలిసిందే. ఆ డేట్ కి మామూలుగా అయితే రిలీజ్ కు రెండు మూడు వారాల ముందు “ట్రైలర్ “లాంచ్ చేస్తుంటారు. కానీ “సలార్ “రేంజే వేరు కదా. ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతోంది. విదేశాల్లో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాంటప్పుడు చాలా ముందుగానే అవుట్ పుట్ రెడీ చేయాలి కదా?
అలాగే ప్రమోషన్ల హడావుడి కూడా పెంచాలి.అందుకే నెల ముందే ఫస్ట్ కాపీ తీయడమే కాక, “ట్రైలర్” కూడా రిలీజ్ కు కనీసం నెల ముందే రిలీజ్ చేయబోతున్నారు. అప్పుడే కోరుకున్న స్థాయిలో హైప్ వస్తుందని అంచనా వేస్తున్నారు. “టీజర్” కొంత నిరాశపర్చిన నేపథ్యంలో “ట్రైలర్” విషయంలో ప్రశాంత్ నీల్ జాగ్రత్త పడతాడనటంలో సందేహం లేదు. అసలు సినిమాలోని హైలెట్స్ లను ట్రైలర్ కోసమే ప్రశాంత్ నీల్ దాచి ఉంచి ట్రైలర్లో చూయించి ప్రేక్షకుల అటెన్షన్‌ను పొందాలని ప్రశాంత్ నీల్ భావిస్తునట్లుగా చెప్పుకోవచ్చు..
Leave a Reply