తింటే గారెలే తినాలి, వింటే రామాయణమే వినాలి అన్నది ఫేమస్ సామెత. రామాయణ ఇథిహాసాన్ని ఎన్ని సార్లు, ఎన్నో భాషల్లో సినిమాగా తీసిన ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది.! అది ఆ పుణ్యపురుషులైన సీతారాముల చరిత యొక్క విశేషం.. రామాయణం గురించి విపులంగా సీరియలే తీశారు.. ఇక చిత్రాల విషయానికొస్తే చాలానే వచ్చాయి.అయినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు అనడానికి నిదర్శనంగా తాజాగా రెడీ అవుతున్న మరో రామాయణం మూవీ నే అయితే ఈ మూవీకు ఇంతలా క్రేజ్ ఎందుక అంటే ఇందులో నటిస్తున్న నటీనటులు చిత్రతారాగణం నిర్మాణ సంస్థలే ఈ సినిమాకు క్రేజ్ ను తెచ్చిపెడుతున్నాయి వీరు ఎంత అందంగా సుందర శోభితంగా ఈ మూవీని తెరపైకు తీసుకు వస్తార!! అని సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది.??
ఈ రామాయణం మూవీలో సాయి పల్లవి నటిస్తుందని వార్త చెక్కర్లు కోడుతుండటమే కారణమని తెలుస్తోంది.. కథల ఎంపికలో ఆచి తూచి అడుగులేసే ఇప్పుడు వేగం పెంచుతుంది. వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈమె ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో, తమిళంలో శివ కార్తికేయన్ తో కలసి నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈమె ఓ భారీ హిందీ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపిన్నట్లుతెలుస్తుంది.. రామాయణం ఇతి వృత్తంతో దర్శకుడు నితీష్ తివారి హిందీలో ఓ భారీ బడ్జెట్లో సినిమాను రూపొందించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవి పాత్రను సాయి పల్లవి పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర బృందం ఆమెను సంప్రదించి చర్చలు జరిపినట్లు అందుకు ఆమె సానుకూలంగా స్పందించింది అని తెలుసిoది. .. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్..
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా వేల క్రితమే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటికీ బండి ముందుకు కదల్లేదు.. గత కొద్ది రోజులుగా దీని గురించి అప్డేట్ వచ్చింది. “ధంగల్” ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో రాముడిగా రణబీర్ కపూర్,సీతామాతగా సాయి పల్లవి,రావణాసురుడిగా ” కే జి ఎఫ్ ” ఫేమ్ ‘యాష్’ నటించనున్నట్లుగా టాక్.. కాగా ఈ రామాయణాన్ని మూడు భాగాలుగా తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ మొదలు పెడతారట…
ఇక మొదటి భాగంలో సీతారాములబాల్యం,విద్యాభ్యాసం, వారి పరిణయానికి సంబంధించిన సీన్స్, రెండవ భాగంలో సీతాదేవిని రావణుడు లంకకు తీసుకొని పోవడం కు సంబంధించిన సీన్స్, రామ రావణ యుద్ధం సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని, ఇక మూడవ భాగంలో లవకుశ ల పుట్టుకకు సంబంధించిన అంశాలు ఉంటాయని తెలుస్తోంది..అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మొత్తం రామాయణ సినిమాలలో సీత పాత్రకు నటించిన హీరోయిన్ల గురించి చర్చ నడుస్తుంది.. పదేళ్ల ముందు తెలుగులో “శ్రీరామ రాజ్యం” మూవీలో సీతాదేవిగా ‘నయనతార’ నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు .
“ఆది పురుష్ “లో సీతాదేవిగా “కృతిసనన్” నప్పలేదని,అలనాటి చిత్రాలలో సంపూర్ణ రామాయణంలో సీతగా నటించిన గీతాంజలి గారు, లవకుశలో సీతగా నటించిన అంజలీదేవి గారు, ఆ పాత్రల్లో ఎంతగానో ఒదిగిపోయారని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారని వీరే నిజమైన సీత అన్నట్లుగా నటించారని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.. దీంతో కొత్తగా తీయబోయే “రామాయణం” మూవీలో “సాయి పల్లవి” సీతగా ఎలా ఉంటుందో, ఆ పాత్రకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతుందో అని ఇప్పటినుండే మూవీ లవర్స్ మధ్య డిస్కషన్స్ మొదలైయ్యయి … ఇక ‘సాయి పల్లవి’ సీత పాత్ర లో ఎలా మెప్పిస్తుందో చూడాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!!!…
Leave a Reply