మరో స్టార్ హీరోయిన్ మెగా కుటుంబానికి కోడలు కాబోతుందా అనే చర్చలు తెలుగు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నాయి. ఎక్కువ శాతం మంది దీనికి అవునే సమాధానం ఇస్తున్నారు ఇప్పటికే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెద్దల అంగీకారంతో మనువాడబోతోంది… వారిద్దరూ ప్రేమలో ఉన్నారని విషయాన్ని చాలా గుట్టుగా దాచిపెట్టారు… ఉంగరాలు మార్చుకొని మేము ప్రేమలో ఉన్నామని చెప్పిన తర్వాతే అందరికీ తెలిసింది!!.

ఈ కోవలోనే హీరోయిన్ “రీతు వర్మ” మెగా ఇంటి కోడలు కాబోతోందని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… నితిన్ వరుణ్ తేజ్ ఫ్రెండ్ కాబట్టి ఆయన ఫంక్షన్ కి వచ్చాడు కాని రీతు వర్మ ఎందుకు వెళ్ళింది? రీతు వర్మ మెగా కుటుంబంతో ఎక్కువగా కలిసిపోతుందని ఏ ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా హాజరువుతోందంటున్నారు. ఎందుకంటే బయట వారికి ఎవరితో సంబంధం లేకుండా మెగా కుటుంబ సభ్యుల ఇంట్లో నీ వేడుకలకు మాత్రమే రీతు వర్మ కచ్చితంగా వెళుతుంది. ఆమె మెగా హీరోను ప్రేమించిందని ఇంట్లో బద్దలు కూడా రెండు వైపులా ఒప్పుకున్నారంటూ అనేక రూమర్లు మొత్తం చక్కెరలు కొడుతున్నాయి.


అయితే ఏ ఇంటికి కోడలుగా వెళ్లబోతోందనేది మాత్రం సస్పెన్స్ గా మారింది సాయిధరమ్ తేజ్‌ను లేదంటే అల్లు శిరీష్ వీరిద్దరిలో ఒకరిని ప్రేమిస్తోందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు…. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మాదిరిగా ఉంగరాలు మార్చుకొని చెప్పేంతవరకు ఈ సస్పెన్స్ తప్పదేమో అనిపిస్తుంది. పెళ్లిచూపులు సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది రీతు వర్మ… ఈ అమ్మడు అటు తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ…
Leave a Reply