క్రేజీ ఆఫర్ కొట్టేసిన “రెజీనా” అగ్ర హీరోతో జోడి !!! ఇప్పటికైనా కల నెరవేరునుందో,లేదో!!….

దక్షిణాది ఇండస్ట్రీలో హీరోయిన్ రెజీనా అంటే తెలియని వారి ఎవరు ఉండరు… ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో భారీ ఆఫర్స్ ని దక్కించుకుంది. ఈమె ముఖారవిందం ఇలియానాకు దగ్గరగా ఉండటంతో అభిమానులు ఆమెను ‘జూనియర్ ఇలియానా’ అని ముద్దు గా కూడా పిలుచుకుంటారు!!!! ఈమె ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజులలో అగ్ర హీరోల సరసన నటించింది…. సాయిధరమ్ తేజ్ తో వరుస సినిమాలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది…. దాంతో సాయిధరమ్ తేజ్ కు మన జూనియర్ ఇలియానా అయినా రెజినాకు మధ్య ఏదో ఉందని ఇండస్ట్రీలో పుకార్లు చక్కర్లు కొట్టాయి!!!…. వీరిద్దరిలో ఎవరు కూడా స్పందించకపోవడంతో ఈ పుకార్లు కొన్ని రోజుల తర్వాత సద్దుమణిగిపోయాయి. ఇటీవల కాలంలో ఈ బ్యూటీ కి చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు  లేవు. అయితే రెజీనా నిత్యం ఏదో ఒక వెబ్ సిరీస్ లలో, చిన్న చిన్న సినిమాల ద్వారా ఇండస్ట్రీ నుంచి తన పేరును తొలగించకుండా, ప్రేక్షకులు తనని మర్చిపోకుండా ప్రేక్షకుల మదిని చేరుతూ ఉంటుంది…. ఇలాంటి సమయంలో రెజీనాకు ఓ క్రేజీ ఆఫర్ వరించిందని కోలీవుడ్ టాక్….

తాజాగా అజిత్ హీరోగా ,మగ్జిల్ తిరుమేని దర్శకత్వంలో “విడముయార్చి” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే!!! ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారని సమాచారం…. అలాగే కథరిత్యా ఈ సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందని ఈ అవకాశం రెజీనా ను వరించిందనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది.‌‌…

అజిత్ సినిమాలో రెజీనా ను ఎంపిక చేసినట్లు సమాచారం వచ్చింది ..”విడముయార్చి”పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభం నుంచి అనేక మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారు. మొదట్లో ఈ సినిమాకు విగ్నేష్ శివన్!! దర్శకత్వం వహించారు… అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు “మగ్జిల్ తిరుమేని” పేరు తెరపైకి వచ్చింది. దీంతో సినిమా కథలు కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి ఈ మూవీలో కథానాయికగా “త్రిష” ,బాలీవుడ్ నటి “హుమా ఖురేషి” హీరోయిన్లుగా నటిస్తారని మరియు విలన్ గా “అర్జున్ దాస్” నటిస్తున్నారని ప్రచారం జరిగింది… అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో “అర్జున్దాస్ “సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది…. ఇప్పుడు ఆ పాత్రను నటుడు ‘ఆరవ్ ‘పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగానే నటి “హుమా ఖురేషి” కూడా సినిమా నుంచి తప్పుకున్నారు.

అయితే “హుమా ఖురేషి” గతంలో అజిత్ సరసన ‘వలిమై’ చిత్రంలో నటించిన ఇప్పుడు విడముయార్చి చిత్రంలో ఆమె బదులు నటి “రెజినా” నుఎంపిక అయినా సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఆమెకు లక్కీ చాన్స్ అనే చెప్పవచ్చు.. తాజాగా వెబ్ సిరీస్ లో నటిస్తున్న రెజినా కు ఈ సినిమా నుంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి. ఇన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత “విడముయార్చి “సినిమా షూటింగ్ అజార్ భైజాన్ లో మొదలైంది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం దుబాయ్, అబుదాబి ప్రాంతాల్లో షూటింగ్ జరిపి ఎట్టకేలకు చైనాలో షూటింగ్ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది… దీనికి “అనిరుద్”నేపథ్య సంగీతం అందిస్తున్నాడని సమాచారం!!.. అయితే ఈ మూవీలో రెజీనా నటిస్తారా లేదా వేచి చూడాలి.. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతుంది వచ్చే ఏడాది కి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page