శాన్ డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ లో పాల్గొనేందుకు ప్రభాస్ కి తోడుగా రానా దగ్గుపాటి కూడా వెళ్లారు. టీజర్ విడుదల కార్యక్రమంలో ఇద్దరు కలిసి సందడి చేయనున్నారు. ఇదే వేదికపై రానా తన కొత్త చిత్రాల్ని, ఇతర ప్రాజెక్టుల్ని కూడా ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో “హిరణ్యకశ్యప” చిత్రం చేసేందుకు రానా ఎప్పటినుండో శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమాని కామిక్ కాన్ వేదికపై ప్రకటించారు…. తను సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా పతాకంపై ఈ చిత్రం రూపొందునున్నది అని చెప్పారు. ‘అమర చిత్రం’ కథల ఆధారంగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ రచనలో ఈ చిత్రం రూపొందునున్నది.
అలాగే “లార్డ్ ఆఫ్ ది డెక్కన్” పేరుతో సోనీ లీవ్ తో కలిసి నిర్మించనున్న సీరియస్ ని కూడా ఈ వేదికపై ప్రకటించారు….. చాళుక్యుల నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కనుంది….. వీకెండ్ బ్లాక్ బస్టర్ సంస్థతో కలిసి మిన్నల్ మురళి హాస్య పాత్రలతో కూడిన మరో ప్రాజెక్టును కూడా ఈ వేదికపై ఆవిష్కరించి అంతర్జాతీయ స్థాయిలో వాటికి ప్రాచుర్యం లభించేలా చేశారు…..
Leave a Reply