PROJECT-K “ఇండియన్ సూపర్ హీరో…. ” లా ప్రభాస్ లుక్ అదిరింది..

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా” ప్రాజెక్ట్ కే “… ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడో అంటూ సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పటికే దీపికా పదుకొనే లుక్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన మేకర్స్ తాజాగా ప్రభాస్ లుక్ ను విడుదల చేశారు. సూపర్ హీరోల డిజైన్ చేసిన ప్రభాస్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది….

ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ సూపర్ హీరోలా, ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు….. లాంగ్ హెయిర్ జుటా జుట్టం, సూపర్ హీరో డ్రెస్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయేలా ఇంటెన్స్ గా ఉంది. ఇండియన్ సూపర్ హీరో అనే మాటకు సరిగ్గా సూట్ అయ్యేలా ఉంది.

ఈ పోస్టర్ తో ప్రాజెక్టుకే చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు… ఇక ప్రాజెక్టుకే ఫస్ట్ గ్లింప్స్ ను అమెరికాలోని శాన్ డియాగో కామిక కాన్ ఈవెంట్లో గురువారం విడుదల చేయబోతుంది చిత్ర యూనిట్….

ఈ గ్రీన్సు ద్వారానే ప్రాజెక్టుకే అంటే అర్థం ఏమిటో రివిల్ చేయబోతుంది చిత్ర యూనిట్… దాదాపు 600 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ‘ప్రాజెక్టుకే’ మూవీలో విలక్షణ నటుడు కమలహాసన్ తో పాటు బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్ కీలకపాత్రను పోషిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంతోనే దీపికా పదుకొనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ స్టాండర్డ్స్ కు దీటుగా ప్రాజెక్టుకే మూవీ ఉండబోతున్నట్లు ప్రచారం….. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రాజెక్టుకే రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది.. ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ లోను ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి దసరా ఫేమ్ సంతోష్ నారాయణ సంగీతాన్ని అందించనున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page