గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టార్ మూవీ ట్రెండ్ మళ్ళీ మొదలైంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అజయ్ దేవగన్ వంటి స్టార్స్ ఒకే సినిమాలో నటించారు….. ఇక ప్రాజెక్ట్ కే కూడా అలాంటిదే ప్రభాస్ , అమితాబచ్చన్ , కమలహాసన్ వంటి భారత దిగ్గజ నటులతో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి…

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ప్రాజెక్టు కే. ఇటీవలే దీనికి సంబంధించి శాండియాగో కామిక్ కాన్ వేడుకల్లో ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ ని రివీల్ చేసింది చిత్రబృందం. దీంతోపాటు ఈ చిత్రానికి టైటిల్ “కల్కి 2898 AD” ని కూడా రివీల్ చేశారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రభాస్ అంతర్జాతీయ మీడియాతో కాసేపు ముచ్చటించారు….


ఈ సందర్భంగా ప్రభాస్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటన అద్భుతం అంటూనే, చరణ్ పర్సనల్గా తనకు బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. ఛాన్స్ వస్తే చరణ్ తో తప్పకుండా సినిమా చేస్తాను. మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తానన్నారు. ఇందులో ఎలాంటి డౌట్స్ లేవన్నారు….


ప్రభాస్ చరణ్ ఇద్దరూ గ్లోబల్ స్టార్లే వీరిద్దరూ కలిసి నటిస్తే అది మరో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పటికే చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. ప్రభాస్ , రామ్ చరణ్ త్వరలో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ బాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ప్రభాస్ చరణ్ కలిసి ఒకే ప్రేమలో కనిపిస్తే ఆ సందడే వేరు అంటున్నారు అభిమానులు…. ఇక దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
Leave a Reply