స్టార్ హీరోయిన్ ‘పూజ హెగ్డే’ ఇటీవల కాలంలో వరుస ప్లాప్ లను ఎదుర్కొంటుంది… మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం నుండి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్నట్లు గత కొన్ని రోజులుగా ఆన్లైన్లో పుకార్లు వ్యాపించాయి! అయితే మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు… ఈనేపథ్యంలో పూజా హెగ్డే మళ్లీ సినిమాలతో బిజీ అయిపోనుంది…


ఇటీవలే ప్రకటించిన రవితేజ తదుపరి చిత్రం కోసం పూజా హెగ్డే ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. గోపీచంద్ మలినేని ఈ ప్రాజెక్టుకి దర్శకత్వం వహించనున్నారు…. రవితేజ తన ప్రస్తుత చిత్రాలను పూర్తి చేసిన వెంటనే షూటింగ్ ప్రారంభంకానుంది ! దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది..


మేకర్స్ ఇటీవలె పూజ హెగ్డే ని సంప్రదించారు మరియు చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలుస్తుంది!… గత రెండు ఏళ్లుగా వరుస ప్లాప్ లను ఎదుర్కొంటున్న పూజా హెగ్డే మళ్లీ తెలుగులో కంబ్యాక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది !! యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది… ఇంకా ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ ఖరారు చేయలేదు.. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తుంది… రవితేజ టైగర్ నాగేశ్వరరావు, డేగ సినిమాలతో ప్రజెంట్ చాలా బిజీగా ఉన్నాడు…


నార్త్ లో రెండు సినిమాలకు సైన్ చేసిన పూజ ఇప్పుడు సౌత్ లోనూ మూడు సినిమాలు చేయనుంది. మెగా మేనల్లుడి సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో పూజ హెగ్డే ని కథానాయికగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది…
Leave a Reply