మెగా డాటర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్య విడాకుల బంధం చివరి దశకు చేరుకుంది. కేవలం రెండు సంవత్సరాల క్రితం రాజస్థాన్లోని ఉదయపూర్ లో డిసెంబర్ 9 2020లో అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహం జరిగింది. ఎంతో వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న వీరు పెళ్లయిన ఏడాది నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు. గత కొద్ది కాలం నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం జోరుగా జరుగుతుంది.
అయితే ఎట్టకేలకు వీరు ఇక కలిసి వాళ్ల వివాహ బంధాన్ని కొనసాగలించలేమంటూ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇందులో పిడిషనల్ నెంబర్ 1 గా జొన్నలగడ్డ చైతన్య పేరు ఉండగా…. పిడిసినల్ నెంబర్ 2 గా నిహారిక పేరు ఉంది. అయితే వీరిద్దరూ విడాకుల కోసం చేసుకున్న దరఖాస్తులో పర్సనల్ అడ్రస్ తో సహా అన్ని వివరాలు ఉన్నాయి. 1955 హిందూ వివాహ చట్టం 13 (8) ప్రకారం వీళ్ళిద్దరూ పిడిషన్ ఫైల్ చేశారు .
ఇక వీరిద్దరూ పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్లు కూడా ప్రకటించేశారు. ఏది ఏమైనా సంవత్సర కాలం నుండి వీరిద్దరూ విడిపోతున్నారంటూ వస్తున్న రకరకాల వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. వీరు త్వరలోనే వేరువేరు దారుల్లో ప్రయాణించనున్నారు. అయితే ఇప్పటివరకు అనధికారికంగా విడిపోయారు. పైకి మాత్రం అధికారికంగా భార్యాభర్తలు గా ఉన్నారు. ఇక ఇప్పుడు పూర్తిగా విడిపోయి ఎవరి జీవితాల్లోకి వారు వెళ్ళిపోనున్నారు …
Leave a Reply