లేడీ సూపర్ స్టార్ నయనతార కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం నెటీంట్లో ట్రెండ్ అవుతోంది. అయితే ఇటీవలే లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన జవాన్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది..అలాగే నయనతార తన సినిమాల విషయంలో తన ఫ్యామిలీ విషయంలో ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటుందని లేడీస్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.. విగ్నేష్ శివన్ మరియు నయన్ లా జోడి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లు వారి జీవితానికి సంబంధించిన ప్రతి మూమెంట్ గురించి ఫోటో సెషన్స్ ద్వారా ఎప్పటికప్పుడు తన అభిమానులకు తెలియజేస్తోంది నయన్. అంతేకాక విగ్నేష్ శివ మరియు నయన్ జోడి గురించి ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం వారి ఇరువురి జోడి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా వారి వైవాహిక జీవితం గురించి వారి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.


ఇక విషయానికి వస్తే లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు తన కవల పిల్లల ఫోటోలను రివిల్ చేసింది. ఇటీవల తన భర్త విగ్నేష్ శివన్, తన కొడుకులతో తో కలిసి ఒక ఫోటో షూట్ చేసి సందడి చేసింది.ఇప్పటివరకు తన కొడుకులకు సంబంధించిన పేస్ లను చూపించకుండా ఫోటోలను వీడియోలను షేర్ చేసిన నయనతార మొదటిసారి తన కవల పిల్లల యొక్క ఫేస్ లను తన అభిమానులకు రివీల్ చేసింది.. ఈ ఫొటోస్ ని చూసిన తన అభిమానులు తమ అభిమాన నటి తన భర్త, కొడుకులతో కలసి ఈ జంట చాలా అందంగా ఉంది అని, తమకెంతో ఆనందంగా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు..


ఈ ఫొటోస్ లో నయన్, విగ్నేష్ శివన్ ల పిల్లలను చూసినవారు అప్పుడే పెద్దవారు అయ్యారు అన్నట్లుగా పిల్లలను ఉద్దేశించి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు, కామెంట్స్ పెడుతున్నారు. ఈ పిక్స్ లలో వైట్ షర్ట్ మరియు బ్లాక్ ప్యాంట్ ధరించిన ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ మరియు ఉలగ్ దైవాగ్ ఎన్ శివన్ లు ఎంతో అందంగా, క్యూట్ లుక్స్ తో అందర్నీ ఆకర్షిస్తున్నారు. ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ఆమె తమిళ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె కథానాయకగా ఎంత బిజీగా ఉన్నా కూడా తన పిల్లలకు సాధ్యమైనంత ఎక్కువ టైంను కేటాయిస్తుందని తెలుస్తోంది.. ఇక విగ్నేష్ శివన్ కూడా దర్శకుడిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే..


మొత్తం మీద లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయన్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తన ఫ్యామిలీతోనూ మరియు తన కెరీర్ లోను సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకు వెళ్తోంది.. ఇదేవిధంగా ఆమె తన ఫ్యామిలీ లైఫ్ ను మరియు సినీ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ మరెన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించాలని తన అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు…
Leave a Reply