‘నవీన్ చంద్ర’, ‘కలర్స్ స్వాతి’ జంటగా నిలిచిన మూవీ “మంత్ ఆఫ్ మధు”… సినిమాకు శ్రీకాంత్ ‘నాగోటి’ దర్శకత్వం వహించాడు… అక్టోబర్ 6న ‘మంత్ ఆఫ్ మధు’ థియేటర్లలో రిలీజ్ అయింది… చాలా కాలం తర్వాత ‘కలర్స్ స్వాతి’,’నవీన్ చంద్ర’ హీరో హీరోయిన్లుగా నటించారు…. త్వరలో ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది… ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే సినిమా…థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల కూడా గడవకముందే ఓటీటి లోకి రాబోతోంది.


ఎమోషనల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈచిత్రం లో “శ్రీ స్వేచ్ఛతోపాటు భార్యాభర్తల బంధాన్ని” గురించి సందేశాత్మక కోణంలో డైరెక్టర్ ‘శ్రీకాంత్ నాగోటి’ ఎంతో చక్కగా “మంత్ ఆఫ్ మధు” సినిమాను రూపొందించాడు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగిగా, తాగుబోతుగా ‘నవీన్ చంద్ర’, కాలేజీ అమ్మాయిగా, గృహిణిగా ‘కలర్స్ స్వాతి’ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపించారు… ఈ మూవీలో వీరిద్దరి నటన బాగుందని సినీ విమర్శకుల నుండి ప్రసంశలు అందుకున్న, కమర్షియల్ గా ‘మంత్ ఆఫ్ మధు’ సక్సెస్ గా నిలవలేకపోయింది!!!… ఇందులో శ్రేయ నవేలి, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు…


కథ ఏంటంటే :
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మధుసూదన్ రావు (నవీన్ చంద్ర ),లేఖ ( కలర్స్ స్వాతి ) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు… ప్రాణంగా ప్రేమించుకున్న వారు మనస్పర్ధలతో విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కుతారు!!.. అందుకు కారణం ఏమిటి??. మధుసూదన్ రావు, లేఖలను అమెరికా నుండి వచ్చిన మధుమతి( శ్రేయ) అనే అమ్మాయి ఎలా కలిపింది అన్నదే ఈ సినిమా కథ!!. పంచతంత్రం సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కలర్స్ స్వాతి ఆ సినిమా తర్వాత నటించిన మూవీ ఇదే కావటం తనకు చాలా స్పెషల్ అని కలర్ స్వాతి చెప్పుకొచ్చారు. అయితే ఈ మూవీ ఆహా ఓటీటి లో నవంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Leave a Reply