ఖిలాడి ఫేమ్ హీరోయిన్ ‘ మీనాక్షి చౌదరి ‘మంచి ఫామ్ లో ఉన్నారు…. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు గుంటూరు కాలంలో సెకండ్ హీరోయిన్గా చేస్తున్నారు.. అలాగే ఈ బ్యూటీ విశ్వక్సేన్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ బ్యూటీని తాజాగా మరో అవకాశం వరించిందని ఫిలింనగర్ సమాచారం….


‘వరుణ్ తేజ్’ కాధానాయకుడిగా వైర ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తుంది. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకుడు. మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మాతలు. ఈనెల 27న ఈ సినిమా ప్రారంభం కానుంది…. ఈ చిత్రంలో కథానాయకగా మీనాక్షి చౌదరిని ఎంచుకున్నారు.

1960 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వరుణ్ సరసన నటించే అవకాశం మీనాక్షి చౌదరి దక్కించుకుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని పోషించనున్నారు….. ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్ మునుపెన్నడూ చూడని విధంగా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. మరి వరుణ్ – మీనాక్షిలు ఈ సినిమా కోసం జోడి కడతారా? లేదా అన్నది వేచి చూడాల్సిందే…
Leave a Reply