పార్ట్ -1 కి మించి ట్విస్ట్ లతో, ఉత్కంఠం రేకెత్తించేలా… ‘మా ఊరి పొలిమే – 2’ ట్రైలర్!… అదిరి పోయిందిగా…

వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు రానున్న తెలుగు చిత్రాలలో “మా ఊరి పొలిమేర 2” ఒకటి. మా ఊరి పొలిమేర 1 మాత్రం నేరుగా ‘ఒ టీ టీ’ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది.. ఇక ఈ మూవీ పార్ట్ 2 ని మాత్రం థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు!!!… ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు… ఈ ట్రైలర్ ప్రేక్షకులకలో ఎంతో ఆసక్తిని గురి చేసే విధంగా ఉంది.

ఈ ట్రైలర్లో కథ ఒక విచిత్రమైన, రహస్యమైన దేవాలయం చుట్టూ తిరుగుతుంది… చాలామంది వ్యక్తులు దాని పురాతన గోడలపై దాగి ఉన్న రహస్యాలను శోధిస్తూ ఉంటారు. ట్రైలర్ స్టార్టింగ్ లో ఈ ఆలయానికి మరియు కేరళలోని అనంత పద్మ నాధ స్వామి ఆలయానికి మధ్య సంబంధం ఉన్నట్లు చూపించారు!!!… దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల మధ్య అంచనాలు ఎక్కువయ్యాయి…

సత్యం రాజేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను, బాలదిత్య ప్రధాన తారాగణంగా రెడీ అవుతున్న “మా ఊరి పొలిమేర 2” చిత్రం “మా ఊరి పొలిమేర ” చిత్రానికి ఇది సీక్వెల్. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీ శంకర్ నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 3న విడుదలకు ముస్తాబౌతోంది. ఇక ఈ చిత్ర బంధం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు హరీష్ శంకర్, హీరో కార్తికేయ, నిర్మాత బన్నీ వాసు ట్రైలర్ను ఘనంగా లాంచ్ చేశారు… అలాగే ఈ సినిమా అఖండ ఘనవిజయాన్ని సాధించాలని వారు ఆకాంక్షించారు.

ఇక నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రాన్ని ఎంతో నిబద్ధతతో, క్రమశిక్షణతో, నిజాయితీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని ఈ చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.దర్శకుడు తన మాటల్లో మా ఊరి పొలిమేర పార్ట్ 1 కుమించి పార్ట్ 2 ఉంటుందని ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆ నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా, ఉంటుందని హీరో బాలదిత్య అన్నారు. మా ఊరి పొలిమేర పార్ట్ 1 ఇక్కడ వరకు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని సత్యం రాజేష్ తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page