Leo OTT : ‘లియో’ మూవీ అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్… రిలీజ్ డేట్ ఫిక్స్!!.. ఎక్కడంటే?

“లోకేష్ కనగరాజ్” దర్శకత్వంలో “తలపతి విజయ్” నటించిన “లియో” సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తుంది!!… ఈ సినిమాలో  విజయ్ సరసన “త్రిష” హీరోయిన్ గా నటించారు…  సుమారు 14 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష కలిసి నటించడం విశేషంగా ఆకట్టుకుంది… ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు… రిలీజ్ అయినప్పటి నుండి లియో చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది… ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది… ప్రస్తుతం ఈ చిత్రం ఓటిటి స్ట్రీమింగ్ గురించి ఓ వార్త నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారింది!!…

లియో సినిమాలో విజయ్ నటన, యాక్షన్స్ సన్నీవేషాలు బాగా ఆకట్టుకున్నాయి… ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కావడం వల్ల ఈ సినిమా పై ముందు నుంచే ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి… యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జ, మిస్కిన్, శాండీ, గౌతమ్ మీనన్ కీలక పాత్రలో నటించారు… మాథ్యూ థామస్ , మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ పలువురు సహాయక పాత్రలో కనిపించారు… లియో చిత్రానికి అనిరుద్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ కూడా పెద్ద ప్లస్ అయిందని చెప్పవచ్చు!!… మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ కూడా మరో బలంగా నిలిచింది…   ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో ఉండగానే తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు…

ఓటీటీ వివరాలు:

లియో మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్  “నెట్ ఫ్లిక్స్” కైవసం చేసుకుంది… లియో చిత్రం అక్టోబర్ 19న థియేటర్లలోకి వచ్చింది.. రిలీజ్ అయిన నెల రోజుల్లోనే స్ట్రీమింగ్ చేసుకునేలా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది… అనగా!! ఈ చిత్రాన్ని నవంబర్ 21 నుండి నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో మూవీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అంటూ సమాచారం తెలుస్తుంది…. ఇక అయితే ప్రస్తుతం ఈ సినిమా ధియేటర్లో కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది… సెవెన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్, జగదీష్ పళని స్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page