ఖుషి : సినిమా నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ ! సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ అదుర్స్….

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత, జంటగా నటిస్తున్న సినిమా ” ఖుషి” ఈ సినిమాను ఫుల్ లెన్త్ ప్రేమ కథ తో తీస్తున్నారు… ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు మంచి రెస్పాన్స్ అందుకోగా!! ఇప్పుడు టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇది కూడా అలానే “మెలోడీస్” గా ఉంది…అయితే మ్యూజిక్ డైరెక్టర్ మళ్లీ ఓ విషయాన్ని సేమ్ ఫాలో అయిపోయారు..

తొలి పాట “నా రోజా నువ్వే”లో మణిరత్నం సినిమా పేర్లతో లిరిక్స్ రాశారు… దీన్ని కాశ్మీర్లో షూట్ చేశారు.. రెండో పాట అయినా “ఆరాధ్య “పాటని భార్య భర్తల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంగా రాశారు . దీన్ని లీడ్ రోల్స్ ఉండే ఇంటిలో షూట్ చేశారు.. టైటిల్ సాంగ్ “ఖుషి”ను టర్కీలో చిత్రీకరించారు.. విజువల్స్ విషయానికొస్తే చాలా రిచ్ గా ఉన్నాయి…ఈ పాటలో హిందీ లవ్ స్టోరీ మూవీస్ లో ఎక్కువగా వినిపించే ప్యార్, ఆషీకీ లాంటి పదాలు వినిపించాయి…

మొదటి పాట అయినా “నా రోజా నువ్వే ” పాటకు సాహిత్యం అందించి ఆకట్టుకున్న శివనిర్వాణ ఈ “ఖుషి” పాటకు కూడా సాహిత్యం అందించగా మ్యూజిక్ డైరెక్టర్ షాహిమ్ అబ్దుల్ వాహబ్ స్వయంగా ఆలపించారు.. ఇక ఇషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన ఈ బాణీ ఎంతో వినసొంపుగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ సాంగ్లో ఉన్న విజువల్స్ మరింత ప్రత్యేక ఆకర్షణ గా నిలిచేలా నీట్,సూపర్ గా ఉన్నాయి…. ఇక ఇప్పటికే “ఖుషి” ఫస్ట్ సింగిల్ “నా రోజా నువ్వే” 100 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేయగా ఇప్పటికీ ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షాట్స్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది… రెండో పాట “ఆరాధ్య” సైతం ఆకట్టుకోగా ఇప్పుడు ఈ “ఖుషి “సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది!! ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని “సెప్టెంబర్ 1″న తెలుగుతో పాటు పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు…

ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని పాటల్ని దర్శకుడు శివ నిర్వాణ రాశారు… బహుశా రాబోయే మిగతా సాంగ్స్ కూడా ఆయనే రాసి ఉంటారనిపిస్తుంది!! “సెప్టెంబర్ 1″న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ కు ఈ పాటల వల్ల మంచి బజ్ క్రియేట్ అవుతుంది… దీన్నిబట్టి చూస్తే ఓపెనింగ్స్ మంచిగానే వస్తాయని అనిపిస్తోంది!! వేచి చూడాలి మరి ఏం జరుగుతుందో????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page