స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది కూడా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ సినిమాతో…. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

అయితే తాజా సమాచారం మేరకు అట్లీ కుమార్ తన తర్వాతి సినిమాను కూడా బాలీవుడ్ లోనే ప్లాన్ చేస్తున్నారట. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం మహానటి కీర్తి సురేష్ ను ఫిక్స్ చేశారట మేకర్స్…. అయితే కీర్తి మాత్రం ఈ సినిమాను కేవలం దర్శకుడు అట్లీ కోసమే చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం అట్లీ కుమార్ సినిమాలకు ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. ఈ దర్శకుడికి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అందుకే అట్లీతో సినిమా చేసేందుకు స్టార్ హీరో సైతం పోటీ పడతారు. అందుకే ఈ చాన్స్ వచ్చిన వెంటనే ఓకే చెప్పిందంట కీర్తి సురేష్. ఇక అట్లీ కీర్తి సురేష్ , వరుణ్ ధావన్ కాంబోలో రానున్న ఈ మూవీకి ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇవ్వనున్నారు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే…
Leave a Reply