బాలీవుడ్ క్వీన్ “కంగానరనౌత్” ‘బీటౌన్’ లో పరిచయం అక్కర్లేని పేరు… ఎప్పుడూ ఏదో ఒక కామెంట్స్, ట్రోల్స్ ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గతంలో బాలీవుడ్ జంట ఆలియాభట్, ‘రణ్ బీర్ కపూర్’పై పలుమార్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే …తాజాగా తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసింది… పరోక్షంగా ఆలియా భట్ ,రన్బీర్ కపూర్ జంటను ఉద్దేశించి ‘ఇన్ స్టా’ లో స్టోరీస్ లో పోస్ట్ చేసింది. అయితే తాజాగా విజయ్ సేతుపతితో కలిసి కంగాన ఓ ప్రాజెక్టులో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే …అయితే నెట్టింట్లో వచ్చిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ పరోక్షంగా విమర్శలు చేసింది…
కంగనా మరో పోస్టులో రాస్తూ బాలీవుడ్ జంట వేరు వేరు అంతస్థులలో నివసిస్తున్నారు. కానీ బయటకు మాత్రం కలసి ఉన్నట్లు నటిస్తారు. మింత్రా బ్రాండ్ ను తమ సొంతం అంటూ నా సినిమా గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు… ఇటీవల అతను కుటుంబ సభ్యులతో కలిసి లండన్ ట్రిప్ వెళ్ళగా! భార్య ఆలియా భట్ ,కుమార్తె రాహు ఇండియాలో ఉన్నారు .. కానీ ఆమె భర్త ఆమెను కలవాలని వేడుకుంటున్నట్లు మెసేజ్లు పంపుతున్నాడని చెబుతోంది…
మరో వైపు ఇన్స్టాలో రాస్తూ సినిమా ప్రమోషన్స్, డబ్బులు కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే జరుగుతుంది …అతను పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదు!! మాఫియా డాడీ ఒత్తిడితో పెళ్లి చేసుకున్నాడు .. పెళ్లి చేసుకున్నందుకు ప్రతిఫలంగా సినిమాల్లో అవకాశం ఇస్తానని అతడు హామీ ఇచ్చాడు.. ఇప్పుడు తన ఈ నకిలీ వివాహం నుంచి విముక్తి పొందాలని తీవ్రంగా ట్రై చేస్తున్నాడు…. కానీ పాపం ఇప్పుడు అతనికి ఎవరూ లేరు! ఇకనుంచి తన భార్య ,కుమార్తె పై దృష్టి పెట్టాలి .ఇండియాలో ఒకసారి పెళ్లయితే అంతా అయిపోయినట్లే ………….. “ఆబ్ సుధార్ జావో”అని రన్బీర్ ఉద్దేశించి కౌంటర్ ఇచ్చింది…..
గతంలో తనపై గూఢచార్యం చేస్తున్నారంటూ, కంగాన ఆరోపించిన సంగతి తెలిసిందే…. తన గురించి ఫోటోగ్రాఫర్లకు ఎలా సమాచారం అందుతుంది, అని ప్రశ్నించింది…. తన వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం లీకవుతోందని కూడా ఆమె ఆరోపించింది… కాగా కంగానా తదుపరి చిత్రం “తేజల్” ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది… అంతేకాకుండా ఆమె తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు “ఎమర్జెన్సీ”లో నటిస్తోంది ఈ చిత్రంలో కంగానా భారత మాజీ ప్రధాని “ఇందిరాగాంధీ” పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది .ఆ తరువాత ‘చంద్రముఖి 2’ సినిమాలోను కీలక పాత్ర పోషించనుంది……
Leave a Reply