పరువు నష్టం కేసులో సినీ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధా మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు… చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేశారు…


వారి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సిడి రూపంలో కోర్టుకు సమర్పించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపి సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు రాజశేఖర్ జీవిత లకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పు పై జిల్లా హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో వారిద్దరూ మెయిల్ బాండ్ల రూపంలో రు. 10,000 చొప్పున పూచీకత్తును సమర్పించి కోర్టు నుంచి విడుదలయ్యారు…
Leave a Reply