గరుడవేగ ఫేమ్ ‘ప్రవీణ్ సత్తారు’ దర్శకత్వంలో ‘వరుణ్ తేజ్’ హీరోగా నటిస్తున్న సినిమా “గాంఢీవధారి అర్జున”….. ఈ సినిమాని SVCC బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ – బాపినీడు నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమాలో “అర్జున్ వర్మ” అనే పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ఆయన సరసన ‘సాక్షి వైద్య’ కథానాయికగా అలరించనుంది. ‘ ఏజెంట్’ తర్వాత ఈమె చేసిన సినిమా ఇదే కావడం విశేషం. ఆగస్టు 25న ఈ సినిమా థియేటర్లోకి రానున్నది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు….

కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ పై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతుంది. ఎవరైనా 5:30 ని సోదించి ఎమర్జెన్సీ అని ప్లేయింగ్ చేయడంతో టీజర్ ఓపెన్ అవుతుంది మరియు అర్జున్ మాత్రమే వాటిని నమ్ముతాడు దాంతో అర్జున్ మోడ్ లోకి వస్తాడు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ… వాళ్ళ వాళ్ళ పాత్ర అర్థమయ్యేలా చేస్తూ ఈ టీజర్ ను విడుదల చేసారు. ఫారిన్లో చిత్రీకరించిన ఫైట్స్, ఛేజింగ్స్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. వరుణ్ తేజ్ పాత్రకు అద్భుతమైన ఫిజికల్ ఫీచర్స్ మరియు కమాండింగ్ ప్రెజెన్స్ అవసరమైన సాలిడ్ ఇమేజ్ ని అందించారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ దృశ్యాలతో గాండీవ దారి టీజర్ అదిరిపోయింది….

తగినంత క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో టీజర్ విజయం సాధించింది. థియేట్రికల్ విడుదలపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది…. వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరికెక్కిన చిత్రం ఇదే కావడం ప్రతి ప్రేమలోనూ కనిపిస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ మునిపెన్నడు చూడని విధంగా కనిపించనున్నారు.


ప్రవీణ్ సత్తారు పేరు యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా కనిపిస్తుంది. స్టైలిష్ మేకింగ్ తో ఆయన యాక్షన్ సినిమాలు ఆకట్టుకుంటూ ఉంటాయి. మిక్కీ జే మేయర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అమెరికాతో పాటు ఐరోపా దేశాలలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిలో నిర్మాణ విలువలు కనిపిస్తూ ఉండడం విశేషం.
Leave a Reply