బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె తన ఫ్యాషన్ సెన్స్ తో కట్టిపడేస్తోంది… తాజాగా ముంబైలో జరిగిన ఓఈవెంట్లో “చీరకట్టు”లో దర్శనమిచ్చింది ‘రాయల్ లుక్’ లో మెరిసిపోతూ చూపు తిప్పుకోకుండా చేసింది.. చీరల్లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది.. ర్యాంప్ వాక్ చేసే సమయంలో ఆమె అందానికి ‘రన్బీర్ సింగ్’ మంత్రముగ్ధుడై ముద్దు కూడా పెట్టడం,సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్ ట్రాన్స్పరెంట్ శారీలో బ్యూటిఫుల్ గా దీపిక తలుక్కుమంది .. ఇప్పటికే అన్ని రకాల అవుట్ ఫిట్ లలో ఫోటోషూట్లు చేసి ట్రెండ్ సెట్ చేసిన దీపిక సాంప్రదాయ దుస్తుల్లోనూ అట్రాక్ట్ చేసింది.. అలాగే డీప్ నెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరూపించింది.. మత్తుచూపులు, మత్తెక్కించే ఫోజులతో మైమరిపించింది..
ఈ ఏడాది “పఠాన్” చిత్రంతో దీపిక భారీ “బ్లాక్ బస్టర్” ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మూడు అతిపెద్ద ప్రాజెక్టుల్లో నటిస్తోంది.. స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే దక్షిణాదిలో పెద్దగా సినిమాలు చేయకున్నా ఈ ముద్దుగుమ్మకు ఇక్కడ క్రేజ్ ఉంది… ఇక త్వరలో కల్కి 2898 ఏడి (project- k) తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తెలుగులో ప్రభాస్ సరసన కల్కి-2898 AD లో నటించి టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది… అటు “జవాన్” లో ‘స్పెషల్ అపీరెన్స్’ తో అలరించనుంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్, హృతిక్ రోషన్ “ఫైటర్” మూవీ లోను నటిస్తూ బిజీగా ఉంది. ప్రభాస్ సరసన నటిస్తున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ మూవీగా రాబోతోంది.
ఇలా ఉంటే… దీపిక పదుకొనే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తారు తెలిసిందే.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ సొట్టబుగ్గల సుందరి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఈ క్రమంలో దీపిక ఏ పోస్ట్ పెట్టినా నెట్టింట క్షణాల్లోనే వైరల్ గా మారుతుంటుంది….
Leave a Reply