బాలీవుడ్ స్టార్ బ్యూటీ “దీపిక పదుకొనె” కి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ “దీపికపదుకొనే” దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్గా నిలిచింది. ఈమె ప్రస్తుతం హిందీలో పలు చిత్రాల్లో నటిస్తు హాలీవుడ్ లో కూడా ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.. ఇదే సమయంలో తెలుగులో ‘ప్రభాస్’ కి జోడిగా “ప్రాజెక్ట్ కే ” సినిమాలో జంటగా నటిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులోనే ఉన్న “దీపికాపదుకొనే”ను ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, ఒక బడా నిర్మాత మీట్ అయ్యారట. తాము చేయబోయే ఒక భారీ ప్రాజెక్టు కోసం ఆమెను సంప్రదించారట. కనీసం కథ కూడా వినకుండా! తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తిగా లేను! అంటూ తేల్చి చెప్పిందని. టీ టౌన్ సమాచారం.
దీపిక ఉద్దేశం ప్రకారం తెలుగులో ప్రస్తుతం చేస్తున్న సినిమా ఫలితాన్ని బట్టి మరో తెలుగు సినిమా ఉంటుందని.అలాగే తెలుగు సినిమాకి తన పారితోషకం మరీ ఎక్కువ అవుతుందని, ఆమె భావిస్తుందట. తెలుగు నిర్మాతలు ఎంత డిమాండ్ చేసినా కూడా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. కానీ ఆమె తెలుగులో సినిమాలు చేసి బాలీవుడ్ లో తన స్థాయిని, క్రేజ్ తగ్గించుకోను అంటూ సన్నిహితుల వద్ద చెబుతుందట.
తెలుగు సినిమాలు చేయడం వల్ల స్థాయి ఎలా తగ్గుతుంది,అంటూ ఆమెను కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు….. సోషల్ మీడియాలో దీపిక పదుకొనే తెలుగు సినిమాలు మరిన్ని చేయాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు….. కానీ ఆమె మాత్రం ‘ప్రాజెక్టు K’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే ఆ సినిమా ఫలితం వచ్చిన తర్వాతే కొత్త సినిమాను మొదలు పెడతాను, అన్నట్లుగా భీష్మించుకు కూర్చుంది. దీపిక తెలుగులో రెండవ సినిమా చేస్తుందా లేదా అనేది తెలియాలంటే కనీసం ఏడాది కాలం వెయిట్ చేయాల్సిందే…….
Leave a Reply