నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన పాన్ ఇండియా మూవీ “దసరా” ఎస్ .ఎల్. వి సినిమా బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్ దస్కత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు మార్చి 30న సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా నాని కెంతో ప్రత్యేక మనే చెప్పాలి.


నేచురల్ స్టార్ నాని నటించిన తొలిపాన్ఇండియా మూవీ ‘దసరా’ సినిమా టాక్ వచ్చేసింది. మాస్ హీరోగా నాని అదరగొట్టారు. ఇక కీర్తి సురేష్ డిగ్లామర్ పాత్ర ను ను చాలా బాగా పోషించింది. ఈ సినిమాలో ప్రేమ, పగ, స్నేహం ఈ మూడింటిని దర్శకుడు శ్రీకాంత్ చక్కగా తరికెక్కించాడు. ఫస్ట్ హాఫ్ లో సెంటిమెంట్ సీన్స్ అదిరిపోయాయి. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ హైలెట్ గా నిలిచాయి.

అయితే సినిమా సెకండ్ హాఫ్ చాలా స్లోగా అనిపించింది. కాని క్లైమాక్స్ అదిరింది. ఇక సాంగ్స్, ఫైట్లు విషయానికొస్తే అన్ని చాలా చక్కగా కుదిరాయి. ఎమోషనల్ సీన్స్ బాగా పండించారు. సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఇంకొంచెం బాగా తీసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక నాని కెరీర్ లో ఇదే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పవచ్చు. నానికి ఇదే పాన్ ఇండియా మూవీ కావడంతో మంచి టాక్ వచ్చింది. ఇక నాని కొత్త లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుందనె చెప్పాలి.
Leave a Reply