Chithha OTT: “చిన్నా” సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్… రిలీజ్ డేట్!!.. సిద్దార్థ్ సరికొత్త సినిమా…. ఎక్కడంటే?

హీరో సిద్ధార్థ్ నటించిన “చిత్త” మూవీ ఇటీవలే తమిళంలో సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే… అయితే!! ఈ సినిమా ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని, సినీ విమర్శకుల ప్రశంసలు సైతం  పొందింది…. కలెక్షన్ కూడా బాగా రాబట్టింది. ఈ “చిత్త” మూవీ ద్వారా చాలా ఏళ్ల తర్వాత సిద్దార్థ్ కు మంచి హిట్ దక్కింది. ఈ “చిత్త” మూవీ తెలుగులో “చిన్నా” పేరుతో అక్టోబర్ 6న రిలీజ్ అయ్యి మంచి ఎమోషనల్ మూవీగా ఈ సినిమా పాజిటివ్ రివ్యూలను పొందింది…. అయితే తాజాగా ఈ చిత్తా(చిన్నా ) సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ కన్ఫర్మ్ చేసుకుంది…

ఈ “చిన్నా” సినిమాలో సిద్దార్థ్ తో పాటు, నిమిష విజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ వండి తారలు ప్రధాన పాత్రలు పోషించారు… చాలా ఎమోషనల్ పాయింట్ పై సున్నితంగా ఈ మూవీ కథ నడిచింది…. ఈ మూవీను తెరకెక్కించిన విధానం కు సినిమా డైరెక్టర్ అయిన “అరుణ్ కుమార్” కు భారీ ప్రశంసలు దక్కాయి.. లోకనాయకుడు ‘కమల్ హాసన్’ కూడా చిత్తా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు…. తమిళంలో తొలిరోజు తక్కువ కలెక్షన్లు  దక్కించుకున్న పాజిటివ్ మౌత్ టాక్ రావటంతో క్రమంగా రెండో రోజు నుంచి మంచి వసూళ్లను రాబట్టింది!!…

చిత్త(చిన్నా) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఒ టీ టీ సంస్థ “డిస్నీ+హాట్ స్టార్” దక్కించుకుంది… ఈ నెల అక్టోబర్ చివరి వారం లో డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నది… అధికారిక ప్రకటన ఇంకా రావలసి ఉంది… చిత్త సినిమా కు ఎస్ యూ అరుణ్ కుమార్ దర్సకత్వం వహించారు….

‘చిత్తా’ తెలుగు వర్షన్ “చిన్నా” ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సిద్దార్థ్ చాలా ఎమోషనల్ అయ్యాడు…. ఇప్పుడు సిద్ధార్థ్ సినిమాలు ఎవరు చూస్తారని, తెలుగు వర్షన్ హక్కులను తీసుకునేందుకు ఎవరు కూడా ముందుకు రాలేదని భావోద్వేగానికి లోనయ్యారు!!… తన జీవితంలో ఇదే బెస్ట్ సినిమా అని చెప్పారు…. అయితే ఎట్టకేలకు “చిన్నా” పేరుతో అక్టోబర్ 6 నా రిలీజ్ అయ్యి మంచి ఎమోషనల్ మూవీగా రెస్పాన్స్ అందుకుంది.. “చిత్త” మూవీ ని “సిద్దార్థ్” స్వయంగా నిర్మించారు… ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్, దిబు నినన్ థామస్ సంగీతం సమకూర్చారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page