“భోళా శంకర్” జం జం జజ్జనక…చిరు ఫ్యాన్స్ కి ఇక పూనకాలే.

మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను మరియు సినీ ప్రేమికులను అలరించేందుకు మాస్ “బోలాశంకర్” తో రాబోతున్నాడు.” మెహర్రమేష్” “దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11, 2023న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.ఇందులో తమన్నా భాటియా కథానాయకగా నడుస్తుంది.

ముందుగా ప్రకటించినట్లుగా రెండవ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించడానికి మేకర్స్ తమ సోషల్ మీడియా ఖాతాలను తీసుకున్నారు. అయితే ఇటీవలే రిలీజ్ చేసిన “భోళా శంకర్ “సినిమాలోని మొదటి సాంగ్ “బోలామేనియా” అనే లిరికల్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన “జామ్ జామ్ జజ్జనక” అనే ట్రాక్ డిజిటల్ గా జూలై 11, 2023న రెండవ లిరికల్ సాంగ్ గా విడుదల చేయబడుతుంది. పాట యొక్క ప్రోమో ఈరోజు సాయంత్రం 04:05 PM కి విడుదల చేయబడుతుంది ఇదే విషయాన్ని తెలియజేసేందుకు చిరంజీవికి సంబంధించిన అద్భుతమైన పోస్టర్ను విడుదల చేశారు . ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మెగా సినిమాలో,చిరు చెల్లెలుగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రంలో సుశాంత్,రఘుబాబు,మురళీ శర్మ,రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి,సురేఖవాణి, శ్రీముఖి, హైపర్ ఆది, వైవాహర్ష, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా “బోలా శంకర్” సినిమాలో చిరు చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు, అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు..”ఆగస్టు 11″ నే రిలీజ్ ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతూ!”బోలాశంకర్” సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. “”జామ్ జామ్ జజ్జనక”” అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో ని,ఈరోజు ఈవినింగ్ రిలీజ్ చేసి,ఫుల్ సాంగ్ ని “జూలై 11″న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ అనౌన్స్మెంటు పోస్టర్లో చిరు ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించాడు. పోస్టర్ డిజైన్ చేసిన విధానం చూస్తుంటే ఇది పెళ్లి సాంగ్ కానీ, ఏదైనా సెలబ్రేషన్ కానీ, అయి ఉండొచ్చు ఇటీవలే చిరు లీక్స్ నుంచి కీర్తి సురేష్, తమన్నాలతో పాటు చిరు డాన్స్ చేస్తున్నా ఒక ఆన్ లోకేషన్ వీడియో ఒకటి బయటికి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో ఈ సాంగ్ కి సంబంధించినదే అయ్యే అవకాశం ఉంది. మరి ప్రోమో రిలీజ్ అయితే ఇది చిరు మాత్రమే కనిపించే పాటనా లేక కీర్తి సురేష్, తమన్నా కూడా ఉండే సెలబ్రేషన్ సాంగా అని వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page