మెగా డాటర్ నిహారికపై ఆమె మాజీ భర్త తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు ,తన కుమారుడి విడాకుల గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారాయి.

మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె 2020లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది .ఆ తర్వాత ఏవో కారణాలవల్ల ఇటీవల కూకట్పల్లి కోర్టులో విడాకులకు అప్లై చేయడంతో జులై 5 న విడాకులు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని నిహారిక ,చైతన్య తమ ఇష్ట ప్రకారం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అయితే వారు ఏ కారణంతో విడిపోయారు! అన్నది మాత్రం క్లారిటీ లేదు .ఈ క్రమంలోనే నిహారికపై ఆమె మాజీ భర్త తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు ,తన కుమారుడి విడాకుల గురించి వస్తున్న వార్తలపై, తన సన్నిహితుల వద్ద, ఈ విధంగా చెప్పుకొని బాధపడ్డారట !


నేను చాలా గౌరవంగా బతికాను మెగా ఫ్యామిలీ అంటే చాలా గౌరవ మర్యాదలు కలిగిన కుటుంబం అనుకున్నాను. కానీ వాళ్ల కూతురు నిహారిక కి అలాంటివేమీ నచ్చలేదు. అలాగే నా కొడుకు గురించి మెగా అభిమానులు దారుణంగా మాట్లాడుతుంటే, ట్రోల్ చేస్తుంటే, మా గౌరవం దెబ్బతింటుంది .అయినా మెగా ఫ్యామిలీ వాళ్లు స్పందించకపోవడం ఏమాత్రం భరించలేకపోతున్నాను. అంటూ చెప్పుకొచ్చారట! ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Leave a Reply