పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులూ “బ్రో “సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది……. ఎప్పటినుంచో ఇద్దరు మెగా హీరోలను కలిసి చూడాలని మెగా ఫాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్న ఈ మధ్య వచ్చిన “ఆచార్య” మూవీ దారుణంగా నిరాశపరచడంతో ఇప్పుడు “బ్రో” సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు సుప్రీం హీరో “సాయిధరమ్ తేజ్” కూడా నటిస్తున్నారు… వినో దయ సిత్తం సినిమాకు రీమేక్ గా, వస్తున్న ఈ సినిమాకు “త్రివిక్రమ్” స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.. “సముద్రఖని” ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది… “బ్రో “సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది…. “పవన్ కళ్యాణ్”, సుప్రీం హీరో “సాయి ధరమ్ తేజ్” కలిసి నటించిన “బ్రో “మూవీ ట్రైలర్ను నేడు విడుదల చేసింది చిత్ర యూనిట్….ఈ ట్రైలర్లో “మామ అల్లుళ్ల ” హంగామా, డైలాగ్స్, స్టైల్ అదిరిపోయాయి…. కాగా “బ్రో” సినిమా ‘జూలై 28’న థియేటర్లలో విడుదల కానుంది .. ఈ సినిమాకు ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. ఇక “బ్రో” మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే…..
ఆ ట్రైలర్లు చూస్తేనే అర్థమవుతుంది …. ఈ మూవీ మెగా ఫ్యాన్స్ లో ‘గూస్బంస్ ‘ను ఏ విధంగా తెప్పిస్తుందో .. ఈ ట్రైలర్ పూర్వం “భస్మాసురుడు” అనే ఒకడు ఉండేవాడు తెలుసా!!!! మీ మనుషులంతా వారి వారసులే… ‘ఎవడి తలమీద వాడే పెట్టుకుంటాడు’… ‘ఇంకెవరికి చాన్స్ ఇవ్వరు’. అనే “పవన్ కళ్యాణ్” డైలాగ్ వాయిస్ ఓవర్ తో మొదలయ్యింది… ఓ దశలో “సాయి ధరమ్ తేజ్” క్యారెక్టర్ టైం లో వెనక్కి వెళ్తాడనేలా డైలాగ్ ఉంది. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. “టైం లేదు,టైం లేదు” అంటూ కాలంతో పరిగెత్తే పాత్రలో సాయిధరమ్ తేజ్ చాలా మెన్లీగా కనిపించాడు … ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు.. టైమ్ ఆఫ్ గాడ్ అంటే “సమయానికి దేవుడు” అనే పాత్రను ఈ చిత్రంలో పోషించాడు… పవన్ కళ్యాణ్ కంగ్రాట్స్ “బ్రో” అందరూ టైంలో ముందుకు వెళుతుంటారు.నువ్వొక్కడివే టైంలో వెనక్కి వెళ్తున్నావ్. అని సాయిధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ అంటాడు. బ్రహ్మానందం కూడా ఈ ట్రైలర్లో కనిపించాడు..
ఈ సినిమా “వినోదయ సిత్తం”కు రీమేక్ అయినా …..దానితో పోలిస్తే బ్రో చాలా “విభిన్నంగా” ఉండనుందని! ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది….. “బ్రో”సినిమాను చాలా ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.. “వినోదయ సిత్తం” కథ కు చాలా మార్పులు చేసి “బ్రో” మూవీని రూపొందించినట్టు, డైరెక్టర్ “సముద్ర ఖని” కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు… “బ్రో”చిత్రానికి “త్రివిక్రమ్ శ్రీనివాస్” డైలాగ్స్ అందించాడు.. కథలోనూ! త్రివిక్రమ్మార్పులు చేసి… తెలుగు ఆడియోస్ ను మెప్పించేలా తీర్చిదిద్దాడని సమాచారం… మరో ఆరు రోజుల్లో (జులై 28) న “బ్రో” సినిమా థియేటర్లోకి రానుంది…
జి స్టూడియోస్ భాగస్వామ్యంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై “బ్రో “చిత్రాన్ని టి జీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు… సుజిత్ వాసుదేవ్ ఈ చిత్రానికి సినిమా ట్రోగ్రాఫర్ గాపనిచేస్తున్నారు… ఈ సినిమాలో “సాయిధరమ్ తేజ్ “సరసన “కేతికశర్మ” హీరోయిన్గా నటిస్తుండగా ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఓ ముఖ్య పాత్ర చేసింది….
Leave a Reply