“భగవంత్ కేసరి” మూవీ రివ్యూ… సినిమా ఎలా ఉందంటే?

నందమూరి నటసింహం “బాలకృష్ణ” “అనిల్ రావిపూడి” దర్శకత్వంలో నేలకొండ భగవంత్ కేసరి అంటూ ప్రేక్షకుల ముందు వచ్చాడు… నేడు అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా “భగవంత్ కేసరి” విడుదలైంది…  ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి… అఖండ,వీరసింహారెడ్డి లాంటి రెండు బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందించిన తర్వాత ప్రస్తుతం భగవంత్ కేసరిగా గర్జిస్తున్నాడు… ఇందులో బాలయ్యకు జోడిగా ‘కాజల్ అగర్వాల్’ నటించగా బాలయ్యకు కూతురుగా “శ్రీ లీలా” నటించారు.  ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు… ఇలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన భగవత్ కేసరి ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో చూద్దాం!!!….

ఈ సినిమాలో బాలయ్య బాబు రొటీన్ గా యాక్షన్ డైలాగులతో మాత్రమే కాకుండా సరికొత్తగా కామెడీతో పాటు ఎమోషనల్ మరియు  బాధ్యత కలిగిన వ్యక్తిగా అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు…. ఇందులో బాలయ్యతోపాటు శ్రీ లీలకి నటనపరంగా మంచి స్కోప్ దొరికింది… బాలయ్య శ్రీ లీల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లను అనిల్ రావిపూడి బాగా పండించారు… శ్రీ లీలా ఫస్ట్ హాఫ్ ప్ లో అల్లరి చిల్లరిగా తిరిగే కాలేజీ పిల్ల తర్వాతి సెకండ్ హాఫ్ లో చనిపోయిన తన తండ్రి లక్ష్యం కోసం పోరాడే అమ్మాయిగా అదరకొట్టింది… శ్రీ లీల బాలయ్య మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో భావిద్యాగానికి గురి చేసే విధంగా ఉన్నాయని!!!…  చాలా ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీ గా భగవత్ కేసరి ఉంది!!  అంటూ  అభిమానులు ట్వీట్ చేస్తున్నారు…

కాజల్ ,బాలయ్య లవ్ ట్రాక్ లో కామెడీ బాగా వర్క్ అవుట్ అయింది… భగవంత్ గారు ఇక్కడ బ్యూటిఫుల్ నైట్…  అక్కడ మూన్ లైట్…  చేతిలో ఐస్ క్రీమ్…  అని కాజల్ చెప్పే రొమాంటిక్ డైలాగ్స్ బాగున్నాయి…  అలాగే బాలయ్య నేను చెప్పా కాచీ…. కాత్యాయని అంటూ  ఆమెను ఆటో పట్టించడం ఆకట్టుకుంది…. ఇక అనిల్ రావిపూడి గత సినిమాలకు భిన్నంగా కామెడీ ట్రాక్ కాకుండా ఎమోషనల్, యాక్షన్ కథను ఎంచుకోవడం వర్క్ అవుట్ అయింది… దీంతో అనిల్ రావు పూడి ఖాతాలో మరో హిట్ పడిందని ప్రేక్షకులు ట్విట్ చేస్తున్నారు…

ఫస్టాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగా వర్క్ అవుట్ అయింది… అనిల్ రావిపూడి బాలయ్య కాంబినేషన్ సూపర్ గా ఉంది అని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు… తమన్ బిజిఎం బాగోలేదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు… కొన్ని సీన్లు చాలా ల్యాగ్ అనిపించాయి… ఫైనల్ గా “భగవంత్ కేసరి” “ఎమోషనల్ ప్లస్ యాక్షన్” మూవీ గా బొమ్మ “హిట్” టాక్ అందుకుంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page