OTT లో సైతం దూసుకుపోతున్న Baby movie

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా విడుదలైన బేబీ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇప్పటికే 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ OTT లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ప్రేక్షకులకు ఇక పండుగే. ఈ మూవీ ఓటిటి రైట్స్ ను ఆహా స్ట్రిమింగ్ ప్లాట్ఫామ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆహాలో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. అటు ఓటిటిలోనూ బేబీ తన సత్తా చూపిస్తుంది.

Aha OTT లో దూసుకుపోతున్న బేబీ

బేబీ మూవీ ప్రస్తుతం ఆహ లో స్ట్రీమ్ అవుతుంది. ఆగస్టు 25 అర్ధరాత్రి నుంచి ఈ సినిమాను అందరికీ ఆహా ott ప్లాట్ఫారం లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి మరియు వీరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ గా నిలిచింది. సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ బాబు, లిరీష, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన మరియు ఇతరులు ముఖ్య పాత్ర పోషించారు.

ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటి లో దూసుకుపోతున్నట్లు ఆహా వెల్లడించింది. కేవలం 32 గంటల్లోనే 100 మిలియన్ నిమిషాల స్ట్రీమింగ్ వచ్చినట్లు ప్రకటించింది.

Baby movie running successfully in ott

తొలి సినిమా తోనే హిట్ సాదించిన వైష్ణవికి ప్రస్తుతం ఆఫర్లు క్యు కడుతున్నాయి. ఆనంద్ దేవరకొండ కెరియర్ లో కూడా ఈ సినిమా మైలు రాయిగా నిలవనుంది. అందులో ఇద్దరూ తెలుగువారు కావడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇటీవల చిరంజీవి కూడా ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. అయితే రియాల్టీ కి ఇది కొంత దూరంగా ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను కనిపెట్టుకొని ఉండాలని కూడా సూచించారు. ఇలాంటి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు మరిన్ని రావాలని అన్నారు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ గా ప్రేక్షకులు ఆదరించారు. ప్రస్తుతం ఓటీటి లో కూడా ఈ సినిమాను ప్రజలు ఆదరిస్తున్నారు.

చిన్న సినిమా గా విడుదలయి భారీ హిట్ సాధించిన బలగం, బేబి సినిమాల ప్రేరణతో టాలీవుడ్ లో మరిన్ని ఇలాంటి వైవిద్యమైన సినిమాలు రావడానికి ఆస్కారం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page