ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్… తన కెరీర్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఐశ్వర్య రాజేష్ ‘ఫర్హానా’ (Farhana) సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్… తన కెరీర్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకని హీరోయిన్ ప్రాధాన్యత చేయాలని నిర్ణయించుకున్నారో తెలియజేశారు. చాలామంది సినీ ప్రముఖులు తన నటనను చూసి ప్రశంసించారు కానీ, తనకు అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదని అందుకే ఆమె నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
అలాగే ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ నా తొలి తమిళ సినిమా విడుదలయ్యాక ఎంతోమంది సినీ ప్రముఖులుప్రశంసించారు. కానీ ఎవ్వరు వారి చిత్రాలలో అవకాశం ఇవ్వలేదని, ఒక ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉన్నానని చాలా బాధపడ్డారు.
అలాగే పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లు చాలామంది ఉన్నారు.. ఈ నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంది.అందుకే చాలామంది నటీమణులకు అవకాశం రావడం లేదు అని. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది అగ్రనుటులు నన్ను, నా నటనను ఎన్నో వేదికలపై పొగిడారు. కానీ వాళ్ల సినిమాల్లో చిన్న పాత్ర కూడా ఇవ్వలేదు. దీంతో నేను చిన్న సినిమాలైనా…… హీరోయిన్ ప్రాధాన్యం ఉన్నవాటిలో నటించాలని నిర్ణయించుకున్నాను.”
అదేవిధంగా తాను ‘కన్నా’ అనే ఓ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ను సోషల్ మీడియాలో చూశాను అని దానికి ఆమె ఎంతో ఇన్స్పైర్ అయ్యిందని, ఆ సినిమాకు ఎంతో ప్రేక్షకాధరణ లభించింది అని తెలియజేశారు. ఇప్పటివరకు 15 మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటించాను. అయినా నాకు అవకాశాలు ఎందుకు రావడం లేదు? తెలియడం లేదు? అయినా సినిమాకు నేను హీరోగా ఉండాలని నిర్ణయించుకున్నాను, ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకంటూ నా సొంత ప్రేక్షకులు ఉన్నారు. అని ఐశ్వర రాజేష్ తన మనోభావాలను పంచుకున్నారు.
Leave a Reply