మార్కెట్లోకి పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ మొదలైన తర్వాత స్టార్ హీరోల రెమినేషన్ ధరలలో కూడా భారీగా పెరిగింది. ప్రజెంట్ టాలీవుడ్ పేరు ఇంటర్నేషనల్ లెవెల్ లో వినిపిస్తోంది. బీ టౌన్ లో పాన్ ఇండియా మూవీల హవా నడుస్తుందని చెప్పుకోవాలి. ఇక స్టార్ హీరోస్ ఐతే రీజినల్ మూవీలను పక్కనపెట్టి పాన్ ఇండియా మూవీలవైపే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో నటించే హీరోలు కూడా రెమ్యూనరేషన్ లను భారీగా పెంచేశారు. ఆఫీస్ వద్ద వంద కోట్లు కలెక్షన్స్ వసూలు చేయడం అంటే అది ఒక మిరాకిల్ అద్భుతం రికార్డ్. పాన్ ఇండియా మూవీ లతో ఆ రికార్డు కామన్ గా మారిపోయింది.
తెలుగు సినిమా పరిశ్రమ నిర్మించే పాన్ ఇండియా మూవీలు 100 కోట్లు కలెక్షన్లు దాటి ఏకంగా 500 కోట్లు 1000 కోట్లు దాకా కలెక్షన్లను రాబడుతున్నాయి. అందువలన టాలీవుడ్ సినిమాల పరిధి పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ వరకు విస్తరించడంతో టాలీవుడ్ సినిమాల కలెక్షన్లకి ఆకాశమేహద్దుగా మారుతుంది. బాహుబలి 2, కే జి ఎఫ్ 2 ,RRR సినిమాలు వేయి కోట్ల క్లబ్ లో కూడా చేరాయి. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోలకు కోటి రూపాయలే హై రెమ్యూనరేషన్ అని అనుకునేవారు. కానీ ప్రస్తుతం హీరోస్ 100 కోట్లు రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట.
1. రెబల్ స్టార్ ప్రభాస్
పాన్ ఇండియా సినిమాల్లో నటించే ఇమేజ్ తో పాటు తన మార్కెట్ పెంచుకున్న స్టార్ హీరోల లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు “బాహుబలి ” సినిమాలో నటించి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు బాహుబలి సినిమా రెండు భాగాలుగా కలిపి వరల్డ్ వైడ్గా దాదాపు 2200 కోట్లు ను వసూలు చేసింది. దీంతో ప్రభాస్ స్టార్ డమ్ కు లిమిట్స్ లేకుండా పోయింది. ఆఫ్టర్ “బాహుబలి” ప్రభాస్ మోస్ట్ వాంటెడ్ ప్యాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు ప్రభాస్ సినిమాల బడ్జెట్ భారీగా పెరిగింది. ప్రజెంట్ ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడని టీ టౌన్ టాక్.
2. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
ఇక హైయ్ రెమ్యూనరేషన్ విషయంలో ప్రభాస్ తర్వాత వినిపిస్తున్న పేరు రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “RRR” మూవీ తో రామ్ చరణ్ పాన్ఇండియా స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. ప్రజెంట్ శంకర్ దర్శకత్వంలో తర్కెక్కుతున్న “గేమ్ ఛేంజర్” సినిమాకి చెర్రీ 100 కోట్లు గా అందుకుంటున్నాడని వార్త టి టౌన్ నందు బాగా హల్చల్ చేస్తుంది. 500 కోట్ల బడ్జెట్ తో “RC15 గేమ్ చేంజర్” సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
3. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్
ఇక “ఆర్ఆర్ఆర్” సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ కూడా తన రెమ్యూనిడేషన్ను పెంచే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలను లైన్లో పెట్టాడు. ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ బ్యానర్లో తెరకెక్కబోతుంది. కాబట్టి లెక్కలు ఇప్పుడప్పుడే తెలిసే అవకాశం లేదు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించే ప్రశాంత్ నీల్ మూవీకి 100 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకునే అవకాశం ఉందని టీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి .
4. సూపర్ స్టార్ మహేష్ బాబు
ఇక వీళ్ల తర్వాత ప్రస్తుతం రేస్ లో ఉన్నది సూపర్ స్టార్ మహేష్ బాబు . 60 కోట్ల రేంజ్ లో ఉన్నాడు. రాజమౌళి సినిమాతో 100 కోట్ల క్లబ్ లో మెంబర్షిప్ తీసుకుంటాడని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
5. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
ఇక పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా సక్సెస్ ను అందుకున్నాడు. పుష్ప 2 సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టేస్తే బన్నీ కూడా 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ రేంజ్ మాత్రమే కాదు స్టార్ హీరోల రెమ్యూనిరేషన్ కూడా ఒక రేంజ్ లో మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు.
Leave a Reply