Kalki 2898 AD: “గ్లింప్స్” తో ప్రబాస్ సినిమా కు తగ్గిన ట్రోల్స్….

“నాగశ్విన్” దర్శకత్వంలో “ప్రభాస్” హీరోగా నటిస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ లుక్ ఇలా వచ్చిందో లేదో! అలా ట్రోలింగ్ షురూ అయింది. ప్రభాస్ లుక్ ఏమాత్రం బాగా లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి.. అయితే ఇప్పుడు ఫస్ట్ లుక్ పై విమర్శలు దాదాపు తగ్గాయి..దీనికి కారణం తాజాగా “శాండియాగో కామిక్ కాన్” లో రిలీజ్ చేసిన గ్లింప్స్ నే కారణం…

ప్రాజెక్ట్ -కే గ్లింప్స్ రిలీజ్ అయింది… అన్నట్టు! ఈ గ్లింప్స్ గురించి చర్చించే ముందు.ఓ చిన్న క్లారిటీ ఇవ్వాలి.. ఈ సినిమా పేరు ఇకపై ప్రాజెక్ట్ -కె కాదు! దీనికి కల్కి 2898 AD అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ తో పాటు గ్లింప్స్ విడుదల చేశారు..

అయితే ఈ మూవీలో పూర్తిగా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది కల్కి 2898 AD :: సైన్స్ ఫిక్షన్ సినిమాకు కాస్త మైథాలాజికల్ టచ్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తోంది.. ‘మహా విష్ణువు’ చివరి అవతారం కల్కి అనే విషయం తెలిసిందే. ఈ మేరకు గ్లింప్స్ లో కొన్ని షాట్స్ కల్కి అవతారాన్ని కూడా సూచించాయి..

గ్లింప్స్ ఇంట్రెస్టింగా మొదలైంది… కాస్ట్యూమ్స్ నుంచి లైటింగ్ వరకు ప్రతిదీ హాలీవుడ్ స్టైల్ లో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. డైరెక్టర్ నాగ్అశ్విన్. అయితే ప్రారంభ సన్నివేశాలు మాత్రం కొన్ని హాలీవుడ్ సినిమాలను తలపించాయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page