“హాలీవుడ్ రేంజ్” లో ప్రాజెక్ట్-కే గ్లింప్స్, టైటిల్ విడుదల….Kalki 2898 AD!

సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆశక్తిగా ఎదురుచూస్తున్న “ప్రాజెక్ట్ కే గ్లిమ్స్” వచ్చేసింది…. అంతే కాకుండా ఈ చిత్రానికి టైటిల్ ని కూడా చిత్ర బృందం ఖరారు చేసింది…. ఈ చిత్రానికి “కల్కి 2898 AD”. అనే టైటిల్ను ఖరారు చేసింది. దీనికి అర్థం ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది.. అప్పుడు అంతం ఆరంభమవుతుంది. అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతున్నట్లు తెలుస్తుంది. “వాట్ ఈజ్ ప్రాజెక్టు కే “. అనే ఒక డైలాగ్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి….. విజువల్స్ అందర్నీ కట్టిపడేసాయి… ఇక ప్రభాస్ లుక్ అదిరిపోయింది . అమెరికాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకలలో చిత్ర బృందం గ్లిమ్స్ టైటిల్ను ప్రకటించింది ఇదే సమయంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది…

ఇక ఈ ఈవెంట్లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ చిత్రంగా ఇది రికార్డుకు ఎక్కింది…. ప్రభాస్ కమలహాసన్ నిర్మాత అశ్వినీదత్ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు… వీటితోపాటు రానా దగ్గుబాటి కూడా వెళ్లారు….

మహానటి తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరికేకిస్తున్న చిత్రమిది… సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడని ప్రకటన వెలువడమే ఆలస్యం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అగ్ర నటులు అమితాబచ్చన్, కమలహాసన్ కీలక పాత్రలు పోషించడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి….. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్గా , ఈ చిత్రంలో దిశా పటాని కూడా నటిస్తున్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page