రెండో సినిమా కే భారీ రెమ్యునరేషన్…. దేవరలో అల్లు అర్హ..

ఐ కాన్ స్టార్ ‘అల్లు అర్జున్’ గారాలపట్టి ‘అల్లు అర్హ’ శకుంతలం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసింది. అల్లు అర్హ ఇప్పుడు మరో భారీ సినిమాలో చేసేందుకు ఛాన్స్ కొట్టేసింది. దీనికి గాను భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం…..

శాకుంతలం సినిమాలో భరతుడిగా ఐదు నిమిషాల పాటు మెరిసింది అల్లు అర్హ. ఈ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చిన అర్హకు మాత్రం మంచి పేరే వచ్చింది. కనిపించింది కొద్దిసేపైనా తన క్యూట్ మాటలు ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇప్పుడు అల్లు అర్హ మరో బిగ్ క్రేజీ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్ దేవరలో చైల్డ్ ఆర్టిస్ట్ అవసరం ఉండడంతో దానికి అర్హని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం అరహాకు భారీ గాని పారితోషికం ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం 20 లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

దాదాపు పది నిమిషాల పాత్ర కోసం అర్హకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇవ్వనట్లు సమాచారం. ఇందులో నిజం ఎంతో తెలియదు గాని ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం దేవర షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఐదు మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ ఐదు షెడ్యూల్స్ లో యాక్షన్ సన్నివేశాలు మాత్రమే తెరకెక్కడం విశేషం.

ఇక దేవర సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేసే విధంగా మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కు జోడిగా జాహ్నవి కపూర్ నటిస్తుంది. ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ దేవర సినిమాతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని ఉన్నాడు. మరోవైపు ఈసారి సోలో హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో భారీ హిట్టు కొట్టాలని తారక్ కసిగా ఉన్నాడు. ఇందులో సైఫలికాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను యువ సుద ఆర్ట్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page